మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా అన్ని ప్రధాన పార్టీలు తో పాటు, స్వతంత్ర అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తున్నారు.ఇప్పటికే అన్ని పార్టీలకు చెందిన నాయకులు నియోజకవర్గంలో మకాం వేశారు.
తమ గెలుపుకు బాటలు వేసుకుంటున్నారు .ఇక ఈ సందర్భంగా ఎన్నెన్నో హామీలు మునుగోడు నియోజకవర్గంలోని ప్రజలకు ఇస్తూ, తమ విజయానికి ఎటువంటి డోకా లేకుండా చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.టిఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పాల్వాయి స్రవంతి పోటీ చేస్తుండగా, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సైతం ఎన్నికల్లో పోటీకి దిగారు.
ముందుగా ప్రజాశాంతి పార్టీ మునుగోడు అభ్యర్థిగా గద్దర్ పేరు వినిపించినా, ఆయన చివరన విషయంలో పోటీ చేసేందుకు విముఖత చూపించడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేస్తున్నారు.
ప్రతి పల్లె, ప్రతి గడపకు తిరుగుతూ, పెద్ద ఎత్తున హామీలు ఇస్తున్నారు.మునుగోడు నియోజకవర్గంలో హల్చల్ చేస్తున్నారు.చిన్నచిన్న షాపులు హోటల్లోలకు వెళ్లి అక్కడ రాజకీయ విన్యాసాలు చేస్తూ, ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.తాను ఎమ్మెల్యేగా గెలిస్తే గెలిచిన ఆరు నెలల లోపే ఈ నియోజకవర్గంలో నిరుద్యోగులకు 7000 ఉద్యోగాలు ఇస్తానని, పెద్ద ఎత్తున నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానంటూ హామీల వర్షం కురిపిస్తున్నారు.
మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఓ చిన్న హోటల్ కు వెళ్లి అక్కడ దోసెలు వేసి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా ఆ హోటల్ నిర్వహిస్తున్న దంపతుల పిల్లలను కేజీ నుంచి పీజీ వరకు తాను చదివిస్తానంటూ హామీ ఇచ్చారు.

మునుగోడు ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే ఈ నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగాలు ఇస్తానని , అందరికీ ఉచిత విద్యను అందిస్తానని, మండలానికి ఒక ఆసుపత్రిని నిర్మిస్తానని, రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తానని ఇలా ఎన్నో హామీలను పాల్ ఇస్తున్నారు.అంతేకాదు టిఆర్ఎస్ , కాంగ్రెస్ , బిజెపి కార్యకర్తలు అంతా తనకే ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరుతున్నారు.ఎన్నికల కమిషన్ పాల్ కు ఉంగరం గుర్తు కేటాయించడంతో, ఆ గుర్తుతోనే ఆయన ఓటర్లను ఈ విధంగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.అయితే పాల్ సీరియస్ గానే హామీలు ఇస్తున్నా.
జనాలు మాత్రం ఆయన చేస్తున్న.ఆయన ఇస్తున్న హామీలను , ఆయన హావభావాలను కామెడీ గానే తీసుకుంటున్నారు.







