బాబోయ్‌ ఏకంగా రజినీకాంత్ వద్దకు వెళ్లాడేంటీ ఈ బింబిసారుడు!

నందమూరి కళ్యాణ్ రామ్ కి సుదీర్ఘ కాలం తర్వాత బింబిసారా సినిమా తో సూపర్ హిట్ ని ఇచ్చిన దర్శకుడు వశిష్ట ప్రస్తుతం బిబిసారా సీక్వెల్ కథ రెడీ చేసే పనిలో ఉన్నాడంటూ అంతా భావిస్తున్నారు.కానీ అనూహ్యంగా ఈ దర్శకుడు తమిళనాడులోని చెన్నైలో ప్రత్యక్షమయ్యాడట.

 Bimbisara Director Vashishta Movie With Rajinikanth , Bimbisara, Director Vashis-TeluguStop.com

అక్కడ తమిళ సూపర్ స్టార్‌ రజనీకాంత్ కి ఒక కథ చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడట.ప్రస్తుతం ఇదే కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

తమిళ సూపర్ స్టార్‌ రజనీకాంత్ తో వశిష్ఠ సినిమా తెరకెక్కిచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు సఫలం అవుతాయో కానీ ఒక్క సినిమాకి దర్శకత్వం వహించి ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ కి కథను చెప్పేందుకు వెళ్లడం అనేది నిజంగా చాలా గొప్ప పెద్ద విషయంగా సినీ విశ్లేషకులు మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Bimbisara, Kalyan Ram, Rajinikanth, Telugu, Vashishta-Movie

బాక్సాఫీస్‌ వద్ద బింబిసారా సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగానే యువ దర్శకుడికి అంత పెద్ద ఛాన్స్ వచ్చింది అనడం లో సందేహం లేదు.రజనీకాంత్ కాకుండా మరే హీరో తో చేసిన కూడా ఈయన కు మంచి సక్సెస్ లభించడం ఖాయమంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి.

ఈ దర్శకుడు అతి త్వరలోనే తెలుగు లో మరో సినిమా ను చేయాలని అభిమానులు కోరుకుంటూ ఉంటే ఈయన మాత్రం తమిళం లో సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేసేందుకు రెడీ అవ్వడం చర్చనీయంశంగా మారింది.అతి త్వరలోనే ఈయన బింబిసార సీక్వెల్ని మొదలు పెడతాడా.

లేదంటే తర్వాత రజనీకాంత్ తో సినిమా ఉంటుందా అనేది చూడాలి.ప్రస్తుతం సినిమా కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.

ఈయన తదుపరి సినిమా ఏంటి అనేది అధికారికంగా ప్రకటించే వరకు క్లారిటీ లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube