ప్రజారాజ్యం బాటలో జనసేన! బీజీపీకి దగ్గరగా... కార్యకర్తలకి దూరంగా

ఏపీ రాజకీయాలలో మూడో ప్రత్యామ్నాయంగా, జీరో బడ్జెట్ పోలిటిక్స్, రాజకీయాలలో సమూల మార్పులే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు.

ఆ తరువాత పరిణామాల నేపధ్యంలో పవన్ చరిష్మా, అభిమాన గణం, అంతా ఆయన వెనుక నిలబడ్డారు.

పవన్ కళ్యాణ్ కి అండగా ఉంటూ ఆయనతో పాటు రాజకీయాలలో క్రియాశీలకంగా పనిచేయడం మొదలెట్టారు.ఇక 2014 ఎన్నికలలో జనసేన పార్టీ ఎక్కడో ఓ చోట పోటీ చేస్తుందని భావించిన ఊహించని విధంగా బీజేపీ, టీడీపీకి మద్దతు ఇచ్చారు.

తరువాత సినిమాలు చేసుకుంటూ పార్ట్ టైం పొలిటీషియన్ ముద్ర వేసుకున్నారు.అయితే 2019 ఎన్నికలలో టీడీపీ, వైసీపీకి ప్రత్యామ్నాయంగా పోటీలో నిలిచిన జనసేన పార్టీ మెరుగైన ఫలితాలు కనబరుస్తుందని అందరూ భావించారు.

అయితే పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు.దీనికి ప్రధాన కారణం ఎన్నికల ముందు అధికార పార్టీ మీద విమర్శలు చేయకుండా ప్రతిపక్షమైన వైసీపీ మీద చేయడంతో టీడీపీ బీ టీం జనసేన అనే మాట జనాల్లోకి వెళ్ళిపోయింది.

Advertisement

ఇది జనసేన పార్టీని నిలువునా ముంచేసింది.అయితే ఎన్నికల తర్వాత కాస్తా రాజకీయాలలో స్పీడ్ పెంచి అధికార పార్టీ తప్పులని ఎత్తి చూపించడంతో ప్రజల్లోకి బలంగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.

ఇంతలో ఊహించని విధంగా పార్టీలో ఎవరితో కనీసం సంప్రదించకుండా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.అదే సమయంలో సినిమాలు చేయనని పదే పది సార్లు చెప్పి ఇప్పుడు ఏకంగా రెండు సినిమాలు స్టార్ట్ చేసేశారు.

ఈ రెండు నిర్ణయాలని పార్టీలో చాలా మంది నాయకులు, కార్త్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.అయిన తనకి అండగా ఉంటూ ఓటమిలో కూడా సైనికులుగా నడుస్తున్న అభిమానులు, కార్యకర్తల అభీష్టం పక్కన పెట్టి, ఎన్నికలకి ముందు ఘోరంగా విమర్శించిన బీజేపీ పార్టీనే ముఖ్యం అనుకోని ప్రయాణం చేస్తున్నారు.

ఈ విషయంలో పవన్ కళ్యాణ్ నిర్ణయంతో చాల మంది ఏకీభవించలేకపోతున్నారు.ఈ నేపధ్యంలో ఇప్పటికే చాలా మంది పార్టీ కార్యకలాపాలకి క్రియాశీలకంగా దూరంగా ఉన్నారు.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
జేసీ పరేషాన్ : కూటమి పార్టీలకు మరో తలనొప్పి 

అదే సమయంలో కీలక నేతలందరూ ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు.ఈ తతంగం చూస్తూ ఉంటే ప్రజారాజ్యం బాటలోనే జనసేన పార్టీ కూడా నడుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Advertisement

మరి సుదీర్ఘ రాజకీయ లక్ష్యం అన్న పవన్ కళ్యాణ్ వరుసగా మాట తప్పుతూ నిలకడలేని తనతో ఎలా ప్రయాణం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తాజా వార్తలు