'ఆదిపురుష్'లో ప్రభాస్ రామావతార లుక్.. ఇంతకీ ఈయన ఫిట్ అయ్యాడా?

ఇండియన్ సినిమా దగ్గర భాషతో సంబంధం లేకుండా అందరు ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఆదిపురుష్.ఈ సినిమా కోసమే కాదు.

ఈ సినిమా నుండి అప్డేట్ కోసం కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.ఎందుకంటే ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుంది? అనే ప్రశ్న అందరిలో ఉంది.డార్లింగ్ రామావతార లుక్ లో ఫిట్ అవుతారా లేదా అనే సందేహాలకు ఇన్ని రోజులకు ఫుల్ స్టాప్ పెట్టారు ఆదిపురుష్ మేకర్స్.

ఎంతో ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్ కు ఈ రోజు ఉదయాన్నే స్పెషల్ ట్రీట్ ఇచ్చారు ఆదిపురుష్ మేకర్స్.ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసారు.

అలాగే ఆదిపురుష్ నుండి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు.దీంతో అందరికి ఉదయాన్నే మంచి ఎనర్జిటిక్ గా అనిపించింది.

Advertisement

మరి ఈ పోస్టర్ చుసిన తర్వాత అందరి సందేహాలు తొలగి పోయాయి అనే చెప్పాలి.రాముడి గెటప్ లో ఇప్పటికే చాలా ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ అవతరించాయి.

అందులోనే ప్రభాస్ ఆ రేంజ్ లో ఉన్నాడు.దీంతో ఇక డైరెక్టర్ సినిమాలో ఇంకెంత అందంగా చూపిస్తారో అని ఆతృతగా ఎదురు చూసారు.

మరి వాటన్నిటికీ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఒకేసారి సమాధానం ఇచ్చారు.ప్రభాస్ రాముడి లుక్ రివీల్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్గెస్ట్ ట్రీట్ ఇచ్చాడు.

ఈ పోస్టర్ చుసిన ఎవ్వరైనా అద్భుతంగా ఉంది అని అనకుండా ఉండలేక పోతున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ప్రభాస్ రాముడిగా ఒదిగిపోయి కనిపిస్తున్నాడు.చేతికి రుద్రాక్షలు ధరించి రాముడిగా.ఆకాశానికి విల్లు ఎక్కు పెట్టి పవర్ ఫుల్ లుక్ లో పొడవాటి జుట్టుతో అచ్చంగా ఆ రాముడే సాక్షాత్తు భూమికి దిగి వచ్చాడా అనేంతలా ప్రభాస్ లుక్ కళ్ళకు ఫీస్ట్ లాగా ఉంది.

Advertisement

ఈయన గెటప్ కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో ఒక్క పోస్టర్ లోనే తెలిసేలా చేసారు.అక్టోబర్ 2న సాయంత్రం 7 గంటల 11 నిముషాలకు అయోధ్యలోని సరయు నది ఒడ్డున ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు చెప్పి అందులో మీరు కూడా భాగం కండి.

అంటూ మేకర్స్ కోరుతూ పోస్టర్ ను రిలీజ్ చేసారు.ఇక ఈ పోస్టర్ ఇండియన్ సినిమా దగ్గర ట్రెండింగ్ లో నిలిచింది.

తాజా వార్తలు