ప్రభాస్ కాలికి గాయం ఇంకా మానలేదా.. నవ్వుతూనే బాధ భరిస్తున్నారా?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం వరస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

ఈయన వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ వరుస సినిమా షూటింగులలో బిజీగా గడుపుతున్నారు.

ఇక త్వరలోనే కల్కి సినిమా( Kalki Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల ముంబైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమంలో కమల్ హాసన్ తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ప్రభాస్ రానా వంటి వారందరు కూడా హాజరై సందడి చేశారు.ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అయితే తాజాగా మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

ఈ వీడియోలో భాగంగా ప్రభాస్ తన కాలికి అయిన గాయం ఇంకా మానలేదని ఇంకా ఆ నొప్పి భరిస్తూనే ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది.

ఈ వీడియోలో భాగంగా ప్రభాస్ దీపిక వేదికపై ఉన్నారు.ఇక ప్రభాస్ ఆమెతో మాట్లాడుతూనే పక్కన నిలుచున్నాడు కానీ ఒక్కసారిగా ఆయన వెనక్కి పడబోయారు.ఆ సమయంలో ఆయన చాలా నొప్పిని భరించారని స్పష్టంగా ఆయన ఫేస్ లో కనపడుతుంది.

కానీ వెంటనే ఆ బాధను కవర్ చేయడానికి నవ్వుతూ కనిపించారు.ప్రభాస్ బాహుబలి సినిమా సమయంలో మోకాలు నొప్పి (Knee Pain) సమస్యతో చాలా బాధపడ్డారు.

అప్పటినుంచి ఆ సమస్య ఇంకా తగ్గలేదని ఇప్పటికే పలుసార్లు సర్జరీ (Surgery) చేయించుకున్న ఆ కాలి గాయం తనని బాధపడుతూనే ఉందని తెలుస్తుంది.ఇక ఈ వీడియో చూసిన అభిమానులు నువ్వు సినిమాలు చేయకపోయినా పర్వాలేదు అని ఆరోగ్యం జాగ్రత్త అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు.

కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు