ఆ హిందీ సినిమా ఫలితాన్ని బట్టి ప్రభాస్ సినిమా..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) ఇప్పటికే చాలా సినిమా లకు కమిట్ అయ్యాడు.

అందులో కొన్ని సినిమా లు విడుదల అవ్వగా కొన్ని సినిమా లు మాత్రం ఇంకా షూటింగ్‌ దశలో ఉన్నాయి.

ఎప్పుడో ప్రకటించిన స్పిరిట్ సినిమా మాత్రం ఇంకా కూడా కనీసం షూటింగ్‌ ప్రారంభం అవ్వలేదు.సందీప్ వంగ( Sandeep Vanga ) దర్శకత్వం లో రూపొందబోతున్న స్పిరిట్ సినిమా( Spirit movie ) విషయం లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ప్రస్తుతం ఉన్న మూడ్ అనుసారంగా సందీప్ వంగ దర్శకత్వం లో హిందీ లో రూపొందిన యానిమల్ సినిమా ఫలితం ఆధారంగా స్పిరిట్ ను ముందుకు తీసుకు పోవాలని భావిస్తున్నాడట.సందీప్ వంగ పై చాలా నమ్మకం తో ప్రభాస్ ఉన్నాడు.

యానిమల్‌ సూపర్‌ హిట్ అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రస్తుతం చేస్తున్న సినిమా ల డేట్ల ను అడ్జస్ట్‌ చేసి మరీ స్పిరిట్ సినిమా కు డేట్లు ఇవ్వాలని భావిస్తున్నాడు.

Advertisement

అదే యానిమల్‌ సినిమా( Animal movie ) డిజాస్టర్‌ అయితే సందీప్ వంగ సినిమా స్పిరిట్ ను కొన్ని రోజుల పాటు హోల్డ్‌ లో పెట్టే అవకాశాలు ఉన్నాయి.ఎందుకంటే బాహుబలి 2 సినిమా తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధేశ్యామ్‌, ఆదిపురుష్ సినిమా లు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.అందుకే ఈ సినిమా ల విషయం లో చాలా జాగ్రత్త లు పాటించాలని ప్రభాస్ భావిస్తున్నాడు.

ఫ్లాప్స్ లో ఉన్న సమయంలో స్పిరిట్ ను చేయడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ కొందరు ఆయన్ను ప్రశ్నిస్తారు.సందీప్ వంగ యానిమల్‌ తో భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే ఎలాంటి సమస్య లేదు.

కానీ ఆ సినిమా ఫ్లాప్ అయితేనే దర్శకుడు సందీప్ వంగ తో ప్రభాస్ సినిమా అంటే ఫ్యాన్స్ ఊరుకునే పరిస్థితి ఉండదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు