ఈ ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' కలెక్షన్స్ ని దాటలేకపోయిన 'సలార్'

ఈ నెల 22 వ తారీఖున భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ‘సలార్’( Salaar ) చిత్రానికి ఏ రేంజ్ లో ఓపెనింగ్స్ వచ్చాయో మనమంతా చూస్తూనే ఉన్నాం.కేవలం 5 రోజుల్లోనే 400 కోట్ల రుపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది.ఇలా అగ్నిపర్వతం లాగ బద్దలై బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని కాల్చేసిన ‘సలారోడు’ ఇప్పుడు ‘సల్లారిపోయాడు’.5 రోజుల తర్వాత ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలలో ఈ చిత్రం వసూళ్లు దారుణంగా డ్రాప్ అయ్యాయి.ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ లో( Andhra Pradesh ) 70 శాతం థియేటర్స్ కి డే డెఫిసిట్స్ పడ్డాయి.సినిమా మొత్తం యాక్షన్ ఉండడం వల్లే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ వైపు అడుగుపెట్టలేదు, ఫలితంగా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి అని కొందరు, లేదు టికెట్ రేట్స్ అధికంగా ఉండడం వల్లే జనాలు థియేటర్స్ కి రావట్లేదు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

 Prabhas Salaar Movie Not Crossed Pawan Kalyan Vakeel Saab Collections In These A-TeluguStop.com
Telugu Andhra Pradesh, Bheemla Nayak, Bro, Pawan Kalyan, Prabhas, Prashanth Neel

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా రెండేళ్ల క్రితం విడుదలైన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వకీల్ సాబ్ చిత్రం కంటే తక్కువ వసూళ్లను వర్కింగ్ డేస్ లో రాబట్టింది.ఉదాహరణకి 5 వ రోజు వకీల్ సాబ్( Vakeel Saab ) చిత్రానికి ఉత్తరాంధ్ర లో కేవలం 100 రూపాయిల టికెట్ రేట్ మీద కోటి ఆరు లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.అదే 5 వ రోజున సలార్ చిత్రానికి 195 రూపాయిల టికెట్ రేట్ మీద కేవలం 71 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.అలాగే ఆరవ రోజు వకీల్ సాబ్ చిత్రానికి ఉత్తరాంధ్ర ప్రాంతం లో 83 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే, ‘సలార్’ చిత్రానికి కేవలం 39 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.

కేవలం ఈ ఒక్క ప్రాంతం లోనే కాదు, గుంటూరు, కృష్ణ వంటి జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి.

Telugu Andhra Pradesh, Bheemla Nayak, Bro, Pawan Kalyan, Prabhas, Prashanth Neel

కృష్ణా జిల్లాలో అయితే ఆరవ రోజు మరియు 7 వ రోజు వచ్చిన వసూళ్లు ‘భీమ్లా నాయక్’( Bheemla Nayak ) మరియు ‘బ్రో’( Bro ) చిత్రాలకంటే తక్కువ వచ్చాయి.ఇది బయ్యర్స్ కి మామూలు దెబ్బ కాదు.సోషల్ మీడియా లో దీనిపై పెద్ద ఎత్తున ట్రోల్ల్స్ కూడా జరుగుతున్నాయి.

వెయ్యి కోట్ల రూపాయిలు కోళ్ల గొడుతుంది అనుకుంటే ఇలా రీమేక్ సినిమా కంటే తక్కువ వసూళ్లు రావడం ఏమిటి అని ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు.ఇక 7 వ రోజు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఈ సినిమాకి రెండు కోట్ల రూపాయిలకంటే తక్కువ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube