పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ప్రాజెక్ట్ కే( Project k ) ఒకటి.
ఈయన చేస్తున్న ప్రాజెక్టులలో ఈ సినిమాపై భారీ హైప్ పెరిగింది.
ఈ మధ్య కాలంలో ఈ సినిమా వార్తల్లో నిలవడంతో మరిన్ని అంచనాలు క్రియేట్ అయ్యాయి.పాన్ వరల్డ్ మూవీగా దీనిని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు.
దీంతో ఈ సినిమాలో స్టార్ క్యాస్ట్ ను కూడా అలాగే ఎంచుకుంటూ హైప్ పెంచుతున్నాడు.ఈ సినిమాలో దీపికా పదుకొనే, బిగ్ బి అమితాబ్ బచ్చన్, దిశా పటానీతో పాటు ఇటీవలే కమల్ హాసన్ కూడా జాయిన్ అయ్యాడు.
దీంతో ఈ పాన్ వరల్డ్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ గా ప్రేక్షకులకు అందించేందుకు నాగ్ అశ్విన్ చాలా కష్ట పడుతున్నాడు.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ అందించారు మేకర్స్.
ఈ సినిమా ప్రకటించినప్పుడే ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ ను అనౌన్స్ చేసారు.దీంతో అప్పటి నుండి నాగ్ అశ్వి( Nag Ashwin )న్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేస్తాడా అని ఎదురు చూస్తున్నారు.అంతేకాదు ప్రాజెక్ట్ కే అంటే అర్ధం తెలియక తెలుసుకోవాలని ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు.
మరి దీని పైనే ఈ రోజు మేకర్స్ బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చారు.
ప్రాజెక్ట్ కే అంటే అర్ధం ఏంటో ఈ రోజు సాయంత్రం 7.10 గంటలకు ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు.ఇక ఈ సినిమా ప్రపంచ ప్రఖ్యాత కామిక్ కాన్ అనే ఇంటర్నేషనల్ సంస్థతో టై అప్ అయినట్టు నిన్న చెప్పి సర్ప్రైజ్ ఇచ్చారు.
ఇక ఈ వేడుక జులై 20న జరగనుండగా ఇక్కడే టైటిల్ అనౌన్స్ మెంట్ ఉంటుంది అని మేకర్స్ ఇప్పటికే తెలిపారు.ఇక ఈ సినిమాను వైజయంతి మూవీస్ వారు నిర్మిస్తుండగా వచ్చే ఏడాది 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy