ప్రభాస్ దీపికా పదుకొనే హీరో హీరోయిన్లుగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రాజెక్ట్ కే మూవీ( Project K ) నుంచి తాజాగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కాగా ఈ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.ఫస్ట్ లుక్ పోస్టర్ విషయంలో నెగిటివ్ కామెంట్లు వినిపించగా గ్లింప్స్ విషయంలో మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
ప్రాజెక్ట్ కే సినిమాకు చిత్రయూనిట్ కల్కి 2898 ఏడీ( Kalki 2898 AD ) అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.ప్రపంచాన్ని చీకటి కమ్మేసిన సమయంలో ఒక శక్తి ఉద్భవిస్తుందని అప్పుడు అంతం ప్రారంభమవుతుందని చెబుతూ ఈ గ్లింప్స్ విడుదలైంది.
ఈ మధ్య కాలంలో ప్రభాస్ లుక్స్( PProject K Prabhas Look ) అద్భుతంగా ఉన్న సినిమా ప్రాజెక్ట్ కే అని గ్లింప్స్ ద్వారా క్లారిటీ వచ్చేసింది.గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్న విధంగానే నాగ్ అశ్విన్( Nag Ashwin ) ప్రేక్షకులను మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నారని ఈ గ్లింప్స్ ద్వారా క్లారిటీ వచ్చేసింది.హీరోయిన్ దీపిక పదుకొనే( Deepika Padukone )ను బానిసలా చూపించారు.ఈ రీజన్ వల్లే ఆమె ఫస్ట్ లుక్ కూడా రొటీన్ గా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ప్రాజెక్ట్ కే విషయంలో ఎలాంటి టెన్షన్ అక్కర్లేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎక్కువగానే శ్రద్ధ పెట్టారని గ్లింప్స్ ద్వారా క్లారిటీ వచ్చేసింది.ప్రభాస్ ఇంట్లో షాట్, అమితాబ్ షాట్, ప్రభాస్ సైడ్ యాంగిల్ షాట్, గ్లింప్స్ బాగున్నాయి.ప్రభాస్ కల్కి అవతారంలో ఈ సినిమాలో కనిపించనున్నారని తెలుస్తోంది.ప్రేక్షకుల ఊహలను మించి ఈ సినిమా ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
భారతీయ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లే సినిమా ప్రాజెక్ట్ కే అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
స్టార్ వార్స్ నుంచి నాగ్ అశ్విన్ రెఫరెన్స్ లను తీసుకున్నారని తెలుస్తోంది.ప్రాజెక్ట్ కే బీజీఎం సైతం అద్భుతంగా ఉంది.నాగ్ అశ్విన్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని తెలుస్తోంది.ప్రాజెక్ట్ కే గ్లింప్స్( Project K Glimpse ) కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.