ప్రభాస్‌ ని బాలీవుడ్‌ రమ్మంటోంది

‘బాహుబలి’ చిత్రంతో దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్‌ను ప్రభాస్‌ సంపాదించుకున్నాడు.

‘బాహుబలి’ ముందు వరకు తెలుగుకు మాత్రమే పరిమితం అయిన ప్రభాస్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను కలిగి ఉన్నాడు.

అందుకే ప్రభాస్‌తో హిందీలో సినిమాలు చేసేందుకు బాలీవుడ్‌ నిర్మాతలు ఎగబడుతున్నారు.ప్రముఖ నిర్మాతలతో పాటు, ఎంతో మంది దర్శకులు సైతం ప్రభాస్‌ కోసం కథలు సిద్దం చేసుకుంటున్నారు.

కొంత మంది దర్శక నిర్మాతలు ఏకంగా ప్రభాస్‌ను తమ సినిమాల్లో నటించాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారట.ఈ విషయాన్ని తాజాగా ఒక ఇంట్వ్యూలో ప్రభాస్‌ చెప్పుకొచ్చాడు.

తనను బాలీవుడ్‌ పిలుస్తోందని, కొందరు ఒత్తిడి కూడా చేస్తున్నారు అంటూ ప్రభాస్‌ చెప్పుకొచ్చాడు.అయితే తాను మాత్రం ‘బాహుబలి 2’ పూర్తి అయ్యే వరకు మరో సినిమా గురించి ఆలోచించను అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

ప్రస్తుతం బాహుబలి సినిమా కోసం వర్కౌట్లు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.‘బాహుబలి’ తీసుకు వచ్చిన క్రేజ్‌తో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిన ప్రభాస్‌ ఆ తర్వాత బాలీవుడ్‌లో సినిమా చేస్తాడేమో చూడాలి.

టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌కు వెళ్లిన ఏ హీరో కూడా పెద్దగా రాణించినట్లుగా రికార్డుల్లో లేదు.అందుకే ప్రభాస్‌ బాలీవుడ్‌ ఎంట్రీకి ఫ్యాన్స్‌ అడ్డు చెబుతున్నారు.

మరి ప్రభాస్‌ నిర్ణయం ఏంటి అనేది ‘బాహుబలి’ రెండవ పార్ట్‌ పూర్తి అయిన తర్వాత కాని తేలేలా లేదు.

Pokiri : పోకిరి సినిమా ఎందుకు ఆడిందో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు
Advertisement

తాజా వార్తలు