యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన 20వ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో పడ్డాడు.ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాను పీరియాడికల్ కథగా చిత్ర యూనిట్ తీర్చిదిద్దుతున్నారు.కాగా ఈ సినిమాతో మరోసారి ప్రభాస్ తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.
ఇక ఈ సినిమా పూర్తి కాకముందే తన నెక్ట్స్ మూవీని రెడీ చేసే పనిలో పడ్డాడు ప్రభాస్.ఇప్పటికే యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పిన కథకు ఇంప్రెస్ అయ్యి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు.
ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయనుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమా థీమ్ గురించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.
ఈ సినిమా కాలంలో ప్రయాణించే కథతో వస్తుందని, ఇందులో నటీనటులు కాలంలో ప్రయాణిస్తారని తెలుస్తోంది.గతంలో నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 చిత్రానికి ఈ సినిమా కథ చాలా దగ్గరగా ఉంటుందని తెలుస్తోంది.
మొత్తానికి ప్రభాస్ ఈసారి బాలయ్య సినిమాను మనకు చూపిస్తాడా అని డార్లింగ్ ఫ్యాన్స్ సందేహిస్తున్నారు.