ప్రభాస్ - హను రాఘవపూడి మూవీ స్టోరీ అండ్ బడ్జెట్ వివరాలు ఇవే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas ) బాహుబలి సిరీస్ తో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు.

ఈ సిరీస్ తర్వాత ఈయన మార్కెట్ వరల్డ్ వైడ్ గా భారీగా పెరగడంతో నిర్మాతలు క్యూ కడుతూ భారీ సినిమాలను ప్రకటించారు.

బాహుబలి తర్వాత ప్రభాస్ మళ్ళీ మరో సినిమా హిట్ అందుకోక పోయిన కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా ఫుల్ బిజీగా వరుసగా పాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషీ ఇస్తున్నాడు.

మరొక నెల రోజుల్లో ఈయన నటించిన సలార్ ( Salaar ) సినిమా రిలీజ్ కానుంది.డిసెంబర్ 22న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.ఇదైనా బ్లాక్ బస్టర్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటి వరకు వచ్చిన ప్లాప్స్ అన్ని మర్చిపోయి సంతోషంగా ఉంటారు.

ఇక దీంతో పాటు డార్లింగ్ చేతిలో కల్కి ( Kalki 2898 AD ) సినిమా కూడా ఉంది.ఈ సినిమాపై కూడా భారీ హోప్స్ పెరిగాయి.

Advertisement

అలాగే ప్రభాస్ మారుతి దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా కూడా స్టార్ట్ అయ్యి ఒక రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి అయినట్టు టాక్.ఇన్ని సినిమాలు చేతిలో ఉండగానే ప్రభాస్ మరో డైరెక్టర్ కు ఓకే చెప్పారని టాక్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

ఈ సినిమాల తర్వాత ప్రభాస్ హను రాఘవపూడితో కూడా ఒక మూవీ ఒప్పుకున్నట్టు కొన్నాళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.మరి ఈ ప్రాజెక్ట్ ఉందో లేదో తెలియదు కానీ ఈ ప్రాజెక్ట్ పై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అయ్యింది.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా ఏకంగా 300 కోట్ల బడ్జెట్ ను కేటాయించనున్నారట.అలాగే ఈ సినిమా స్టోరీ కూడా లీక్ అయ్యింది.

ఈ మూవీ సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ మూవీ లవ్, యాక్షన్ తో కూడిన ఎంటర్టైనర్ గా రూపొందించనున్నారు అనే టాక్ వినిపిస్తుంది.చూడాలి ఈ మూవీ అఫిషియల్ గా ఎప్పుడు ప్రకటిస్తారో.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు