మధుమేహం ఉన్నవారు తప్పక తీసుకోవాల్సిన మూడు రకాల ఆకులు ఇవే!

మధుమేహం.దీనినే డయాబెటిస్( Diabetes ) లేదా చక్కెర వ్యాధి అని పిలుస్తారు.

 These Are The Three Types Of Leaves That People With Diabetes Must Take , Dia-TeluguStop.com

ఇటీవల రోజుల్లో కనీసం ఇంటికి ఒకరైన మధుమేహం బాధితులు ఉంటున్నారు.మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, శరీరానికి శ్రమ లేకపోవడం, ఒత్తిడి తదితర కారణాల వల్ల చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు.

శరీరంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే ఎన్నో సమస్యలు తలెత్తుతుంటాయి.నీరసం, బలహీనత మాత్రమే కాకుండా అవయవాల పనితీరు సైతం నెమ్మదిస్తుంది.

అందుకే షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుకోవడం ఎంతో అవసరం.

Telugu Curry, Diabetes, Fenugreek, Tips, Latest, Mango-Telugu Health

అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే మూడు రకాల ఆకులు గ్రేట్ గా సహాయపడతాయి.మధుమేహం ఉన్నవారు ఈ మూడు రకాల ఆకులు తప్పక తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.మరి ఇంతకీ ఆ మూడు రకాల ఆకులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కరివేపాకు.( Curry leaves ) రక్తంలో చక్కెర స్థాయిల‌ను సహజంగా నియంత్రించడానికి అద్భుతంగా తోడ్పడుతుంది.ఫైబర్ పుష్కలంగా ఉండే కరివేపాకు ఇన్సులిన్ చర్యను పెంచుతుంది.షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది.అందుకే మధుమేహం ఉన్నవారు నిత్యం కరివేపాకును తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.అలాగే మావిడాకులు కూడా మధుమేహం ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటాయి.

మూడు లేదా నాలుగు ఫ్రెష్ మామిడాకులు( Mango leaves ) వాటర్ లో వేసి పది నిమిషాలు మరిగించి తీసుకోవాలి.మామిడాకుల్లో ఫైబర్, విటమిన్ సి, పెక్టిన్ వంటి పోషకాలు ఉంటాయి.

ఇవి అధిక చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.అదే సమయంలో కొలెస్ట్రాల్ ను సైతం క‌రిగిస్తాయి.

Telugu Curry, Diabetes, Fenugreek, Tips, Latest, Mango-Telugu Health

ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మెంతి ఆకు.రుచి పరంగా కొంచెం చేదుగా ఉన్నా కూడా మెంతి ఆకులో పోషకాలు మెండుగా ఉంటాయి.ముఖ్యంగా మధుమేహం ఉన్న వారికి మెంతి ఆకు( Fenugreek leaf ) ఒక వరం అని చెప్పుకోవచ్చు.మధుమేహంతో బాధపడుతున్న వారు రెండు రోజులకు ఒకసారి మెంతి ఆకు తీసుకుంటే సహజంగానే బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube