అనిమల్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్న పాన్ ఇండియా హీరో...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డైరెక్టర్ వాళ్ల కంటు ఒక ప్రత్యేక మైన గుర్తింపు సంపాదించడం కోసం అహర్నిశలు కష్టపడుతూ తమదైన రీతిలో ముందుకు దూసుకెళ్తుంటారు.

ఇక ఇలాంటి క్రమంలోనే అర్జున్ రెడ్డి సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) ప్రస్తుతం బాలీవుడ్ హీరో అయిన రణ్బీర్ కపూర్ తో అనిమల్( Animal Movie ) అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా డిసెంబర్ 1 వ తేదీన రిలీజ్ కి రెడీగా ఉంది.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ అద్భుతంగా ఉండడంతో సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ భారీ పెరిగిపోతున్నాయి.

ఇక ఈ సినిమాతో మరో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాడు అంటూ సందీప్ రెడ్డి వంగా పైన చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలైతే వస్తున్నాయి.ఇక నిజానికి ఆయన చేసిన ప్రతి సినిమా మీద కూడా మంచి అంచనాలు అయితే ఉంటున్నాయి.ఎందుకంటే ఇప్పటికే అర్జున్ రెడ్డి సినిమాని( Arjun Reddy ) హిందీలో కభిర్ సింగ్( Kabir Singh ) పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు.

దాంతో ఈ సినిమా మీద కూడా మంచిగా ఉన్నాయి.

Advertisement

అయితే ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ఏంటంటే ఈ సినిమాలో ఒక కామియో రోల్ ఉందంట దానికోసం పాన్ ఇండియా హీరో అయిన ప్రభాస్ ని( Prabhas ) ఈ సినిమాలో నటింపజేసినట్టుగా తెలుస్తుంది.ఇక సందీప్ రెడ్డి వంగ తన నెక్స్ట్ సినిమా స్పిరిట్( Spirit Movie ) ప్రభాస్ తో చేయబోతున్న క్రమంలోనే ఈ సినిమాకి చిన్న ఐదు నిమిషాల పాత్ర కోసం ప్రభాస్ తో చేస్తున్నట్టు గా తెలుస్తుంది.అయితే ఈ న్యూస్ బయటికి రావడంతో సినిమా మరో రేంజ్ కి వెళ్ళిపోయింది.

ఇక ఈ న్యూస్ ని సినిమా యూనిట్ రహస్యం గా ఉంచి థియేటర్ లోనే సడన్ సర్ప్రైజ్ ఇవ్వ బోతున్నట్టు గా తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు