మహాశివుడిగా 'పవన్ కళ్యాణ్'..శ్రీరాముడిగా 'ప్రభాస్'..ఇద్దరిలో బాక్స్ ఆఫీస్ విజేతగా ఎవరు నిలుస్తారో!

సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న హీరోలను అభిమానులు దేవుళ్లతో సమానం గా ఆరాధిస్తారు.

ఇక్కడ ఉన్నటువంటి వీరాభిమానం మిగిలిన ఏ ఇండస్ట్రీ లో కూడా ఉండదు అని అంటూ ఉంటారు విశ్లేషకులు.

పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ,రజినీకాంత్ , విజయ్ మరియు అజిత్ వంటి హీరోలను అభిమానులు దేవుళ్లతో సమానంగా కొలుస్తారు.అలాంటిది ఈ హీరోలు సాక్షాత్తు దేవుళ్ళ పాత్రలే పోషిస్తే ఇక అభిమానుల ఆనందానికి హద్దులే ఉండవు.

రీసెంట్ గా ఈ ఇద్దరి హీరోలు చేస్తున్న సినిమాలలో దేవుళ్లుగా నటించారు.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం బ్రో ది అవతార్( Bro The Avatar ) లో మహా శివుడి అంశం లోని కాలుడి గా నటించాడు.

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్స్ కూడా రీసెంట్ గానే విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.ఈరోజు కూడా ఈ చిత్రానికి సంబంధించి ఒక సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు, దానికి కూడా రెస్పాన్స్ అదిరిపోయింది.

Prabhas Adipurush Pawan Kalyan Bro Movie Box Office Winner Details, Prabhas ,adi
Advertisement
Prabhas Adipurush Pawan Kalyan Bro Movie Box Office Winner Details, Prabhas ,adi

పవన్ కళ్యాణ్ ఇది వరకే గోపాల గోపాల చిత్రం లో శ్రీ కృష్ణుడిగా నటించాడు, ఇందులో మన అందరం సరికొత్త పవన్ కళ్యాణ్ ని చూసాము.అభిమానులు కూడా ఆయనని అలా చూసి ఎంతగానో మురిసిపోయారు, ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే విశ్వరూపం సన్నివేశాన్ని ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు.బ్రో ది అవతార్ చిత్రం లో కూడా అదే రేంజ్ దైవత్వాన్ని ప్రదర్శించబోతున్నాడు పవన్ కళ్యాణ్.

ఈ చిత్రం జులై 28 వ తారీఖున విడుదల కాబోతుంది.మరోపక్క ప్రభాస్( Prabhas ) ఆదిపురుష్ చిత్రం( Adipurush ) ద్వారా శ్రీ రాముడిగా మన ముందుకు రాబోతున్నాడు.

ఈ చిత్రం వచ్చే నెల 16 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.ఈ సినిమాలో శ్రీరాముడి గెటప్ లో కనిపిస్తున్న ప్రభాస్ ని చూసి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ , ట్రైలర్ మరియు పాటలు విడుదలై ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.

Prabhas Adipurush Pawan Kalyan Bro Movie Box Office Winner Details, Prabhas ,adi
ఈ రెండు ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను పొందొచ్చు!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి3, సోమవారం 2025

ఓవర్సీస్ లో అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యింది.సుమారుగా ఏడాది నుండి పెద్ద హీరోల సినిమాలు లేకపోవడం చేత ఆదిపురుష్ చిత్రానికి అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తాయని బలంగా నమ్ముతున్నారు.మన టాలీవుడ్ ఆడియన్స్ కంటే కూడా బాలీవుడ్ ఆడియన్స్ ఈ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

మరి భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది తెలియాలంటే మరో రెండు వారాలు ఆగాల్సిందే.అలా ఒక నెల గ్యాప్ తో శ్రీ రాముడిగా ప్రభాస్ , మహా శివుడిగా పవన్ కళ్యాణ్ థియేటర్స్ లోకి రాబోతున్నారు.

వీళ్ళిద్దరిలో జనాలు ఎవరికీ బ్రహ్మరథం పడుతారో చూడాలి.మరో విశేషం ఏమిటంటే ఈ రెండు చిత్రాలకు నిర్మాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కావడం విశేషం.ప్రస్తుతం వరుస ఫ్లాప్స్ తో డీలాపడిన ఈ సంస్థ ని ఈ రెండు సినిమాలు పైకి లేపుతాయో లేదో చూడాలి.

తాజా వార్తలు