ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ ఆది పురుష్ షూటింగ్ మొన్నటి వరకు ముంబయి లో చేశారు.గత కొన్నాళ్లు గా ఈ సినిమా షూటింగ్ ను కరోనా కారణంగా నిలిపి వేయడం జరిగింది.
ముంబయి లోని ప్రత్యేకంగా వేసిన సెట్టింగ్లో గ్రీన్ మ్యాట్ పై ప్రభాస్ మరియు ముఖ్య నటీ నటుల పై కీలక సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది.భారీ ఎత్తున అంచనాలున్న ఆది పురుష్ సినిమా కు సంబంధించిన షూటింగ్ ను హైదరాబాద్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట.
ప్రముఖ రామోజీ ఫిల్మ్ సిటీ లో ఆది పురుష్ కు సంబంధించిన ఒక భారీ సెట్టింగ్ ను ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు అక్కడకు చేరుకున్నారనే వార్తలు వస్తున్నాయి.బాలీవుడ్ వర్గాల్లో ఆది పురుష్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అలాంటి భారీ సినిమాను హైదరాబాద్ లో షూట్ చేయబోతున్నట్లుగా చెబుతున్నారు.
ఆది పురుష్ సినిమా లో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇక రావణుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నాడు.వీరిద్దరికి సంబంధించిన కీలక సన్నివేశాలను హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది.
రామోజీ ఫిల్మ్ సిటీ కి త్వరలోనే ప్రభాస్ తో పాటు ముఖ్య తారాగణం కూడా చేరుతారనే వార్తలు వస్తున్నాయి.మొత్తానికి ఈ సినిమా షూటింగ్ ను ముంబయి తో పాటు హైదరాబాద్ లో కూడా నిర్వహించాలని ముందస్తుగానే నిర్ణయించారని, అందులో భాగంగానే నాలుగు నుండి అయిదు వారాల పాటు హైదరాబాద్ లో షూటింగ్ జరుప బోతున్నట్లుగా తెలుస్తోంది.
ఆది పురుష్ ను వచ్చే ఏడాది ఆగస్టు లో విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్న విషయం తెల్సిందే.