#ప్రభాస్25 సినిమాపై ఆసక్తికర బజ్ !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన విషయం తెలిసిందే.

ఈ సినిమా తర్వాత అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బాలీవుడ్ హీరోలకు సైతం నిద్ర లేకుండా చేస్తున్నాడు.

ప్రెసెంట్ ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్సినిమా ఇప్పటికే చివరి దశకు చేరుకుంది.

కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే ఉంది.ఇక ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

ఇక ఈ సినిమా అలా ఉండగానే ప్రభాస్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 30 శాతం వరకు పూర్తి చేసుకుంది.

Advertisement

కేజీఎఫ్ తో మంచి సాలిడ్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాను కూడా ఫుల్ యాక్షన్ అండ్ రొమాంటిక్ గా తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాతో పాటు ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం నేపథ్యంలో ఆదిపురుష్ సినిమా తెరకెక్కుతుంది.సలార్ సినిమా ఆదిపురుష్ సినిమా రెండు కూడా సమాంతరంగా షూటింగ్ జరుపు కుంటున్నాయి.ఈ సినిమాలతో పాటు ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా కూడా ఎప్పుడో ప్రకటించాడు.

ఈ సినిమా ప్రభాస్ లేకుండానే షూటింగ్ జరుపుకుంటుంది.

ఈ నాలుగు సినిమాలే కాకుండా మరొక రెండు సినిమాలను కూడా ప్రభాస్ లైన్లో పెడుతున్నట్టు తెలుస్తుంది.బాలీవుడ్ లో మరొక ప్రముఖ దర్సకుడితో ఒక సినిమా ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి.ఇక దీనితో పాటు దిల్ రాజు బ్యానర్ లో కూడా ఒక సినిమాను ప్రభాస్ చేయబోతున్నాడని సమాచారం.

పవన్ ప్రమాణ స్వీకారానికి లావణ్య త్రిపాఠి హాజరు కాకపోవడానికి కారణాలివేనా?
సంతానం లేక ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఒక్కసారి ఆలయానికి వెళితే చాలు..!

ఇక ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో 25వ సినిమాగా తెరకెక్కుతుంది.ఈ సినిమా కోసం దిల్ రాజు ఇప్పటికే వృందావన అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడని టాక్.

Advertisement

ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో దద్దరిల్లేలా ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి.ప్రెసెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాలు పూర్తి అవ్వడానికి కనీసం 2 ఏళ్ళు పడుతుంది.

ఇక ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి అయినా తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందట చూడాలి మరి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో.

తాజా వార్తలు