మల్లేశం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల ఆ తర్వాత ప్లే బ్యాక్ సినిమా లో నటించి మెప్పించింది.హీరోయిన్ గా కూడా ఈమెకు మంచి ఆఫర్లు వస్తాయని అంతా భావించారు.
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో ఈమె కనిపించిన విషయం తెల్సిందే.ఆ సినిమా మంచి విజయం సాధించింది.
అలాగే అనన్య కు కూడా మంచి పేరు అయితే వచ్చింది.కాని ఆ సినిమా ఆమెకు మరిన్ని ఆఫర్లు మాత్రం తెచ్చి పెట్టడం లేదు.
ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం అనన్య నాగళ్ల ఆఫర్ల కోసం వెయిట్ చేస్తుందట.చిన్నా చితకా ఆఫర్లు వస్తున్నా కూడా పెద్ద ఆఫర్లు ఆమె తలుపు తట్టడం లేదట.
వెబ్ సిరీస్ లు మరియు కోటి లోపు బడ్జెట్ సినిమాల్లో నటించేందుకు ఓకే చెప్తే ఇప్పటికే అయిదు ఆరు సినిమాలు ఈమె ఖాతాలో ఉండేవి.కాని ఈమె మాత్రం కాస్త ఆలస్యం అయినా కూడా పెద్ద సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో తెలుగు మరియు తమిళంలో పెద్ద సినిమా ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది.
సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించేలా అందాల ప్రదర్శణ చేస్తూ పద్దతైన ఫొటోలను షేర్ చేస్తూ ఉంది.
అందాలను చూపిస్తూ ఈమె షేర్ చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.అయినా కూడా ఈమెను ఫిల్మ్ మేకర్స్ పట్టించుకోక పోవడం విచారకరం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అనన్య నాగళ్ల ఇప్పుడు కాకున్నా ఇంకా కొన్ని రోజుల తర్వాత అయినా టాలీవుడ్ లో బిజీ అవుతుంది అనే నమ్మకంను ఆమె అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సినిమా షూటింగ్ కోసం అనన్య ఎదురు చూస్తుంది అనేది నిజమా లేక ఇప్పటికే సినిమా లు కమిట్ అయ్యిందా అనేది ఆమె చెప్తే కాని క్లారిటీ వచ్చే అవకాశం లేదు.