వాళ్ల తండ్రి మాదిరిగానే అంటూ జగన్ ని పొగిడిన జేసీ ప్రభాకర్ రెడ్డి..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాను గాలి వీచినా గాని తాడిపత్రి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవడం సంచలనం సృష్టించింది.

అయితే తెలుగుదేశం పార్టీ గెలుపుకి కారణం జేసి బ్రదర్స్ అని నియోజకవర్గంలో అందరూ చెబుతున్న మాట.

కార్యకర్తల కు ధైర్యం చెబుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్ గా పోటీ చేసి అధికార పార్టీని ఎదుర్కొని దాదాపు నియోజకవర్గంలో మ్యాజిక్ ఫిగర్ సాధించడమే కాక వామపక్షాల మద్దతు కూడా కలుపుకొని మున్సిపల్ చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జెసి ప్రభాకర్ రెడ్డి సీఎం జగన్ పై పొగడ్తల వర్షం కురిపించారు.

వాళ్ల చేతిలో అధికారం ఉంది, వాళ్లు అనుకుంటే మున్సిపల్ చైర్మన్ గెలిచే ఛాన్స్ కూడా ఉంది.కానీ ప్రజాస్వామ్యబద్ధంగా నడిపించారు.అందువల్లే మున్సిపల్ చైర్మన్ అయ్య గలిగాను వాళ్లకి కూడా కృతజ్ఞతలు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.

  వాళ్ల తండ్రి వైఎస్ మాదిరిగానే జగన్ కి కూడా నైతిక విలువలు ఉన్నాయని పేర్కొన్నారు.వైయస్ కి తాను పెద్ద శిష్యుడిని అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయనపై ఉన్న అభిమానాన్ని తాజాగా చాటుకున్నారు.

Advertisement

 .

రూ.77 వేల కీచైన్ కొని భర్తకు భార్య షాక్.. రియాక్షన్ మాత్రం మామూలుగా లేదుగా!!
Advertisement

తాజా వార్తలు