ప్రపంచంలోనే పవర్‌పుల్ పాస్‌పోర్టులు.. ఏకంగా 193 దేశాలు చుట్టి రావొచ్చు!

పాస్ పోర్ట్ అంటే ఏమిటో చెప్పాల్సిన పనిలేదు.ఇది లేకుండా మనం ఒకదేశం నుండి మరొక దేశానికి వెళ్లలేము.

పాస్‌పోర్టులలో అనేక రకాలున్నాయి.అయితే ఎన్ని వున్నా.

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టులుగా జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా దేశాల పాస్‌పోర్టులు అగ్రస్థానాల్లో కొనసాగుతున్నాయి.ఎందుకంటే అక్కడి పాస్ పోర్టులతో ఎన్నో దేశాలు చుట్టిరావొచ్చు.

ఎలాంటి అంతరాయాలు లేకుండా 193 దేశాలను సులభంగా చుట్టివచ్చేందుకు అవకాశం ఇస్తున్న జపాన్ పాస్‌పోర్టు ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలవడం గమనార్హం.అలాగే సింగపూర్, దక్షిణ కొరియాలు 2వ స్థానంలో నిలిచాయని హేన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ తాజాగా వెల్లడించింది.

Advertisement

ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ సంస్థ అయిన హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ ప్రతి సంవత్సరం పవర్‌పుల్ పాస్‌పోర్టుల జాబితా లిస్టు బయటపెడుతూ ఉంటుంది.తాజాగా ఈ జాబితాలో భారత్‌ 87వ స్థానంతో సరిపెట్టుకుంది.

ఎలాంటి చిక్కులకు అవకాశం లేకుండా ఏ దేశం పాస్‌పోర్టుతో ఎన్ని దేశాల్లో పర్యటించవచ్చనే కొలమానంతో ఈ పవర్‌పుల్ పాస్‌పోర్ట్ జాబితాను ప్రతి సంవత్సరం రూపొందిస్తుంటారు.దీంట్లో 50వ స్థానంలో నిలిచిన రష్యా 119 దేశాల్లో పర్యటించడానికి అవకాశమిస్తోంది.

ఇక 80 దేశాల్లో పర్యటించే అవకాశం కల్పిస్తున్న చైనా పాస్ పోర్టు 69వ స్థానంతో సరిపెట్టుకుంది.

ఇక కేవలం 27 దేశాల్లో మాత్రమే పర్యటించే అవకాశమిస్తున్న ఆప్ఘనిస్తాన్ పాస్‌పోర్టు అత్యంత తక్కువ ఉపయోగకరమైన పాస్‌పోర్టుగా దిగువ స్థాయిలో నిలిచింది. బ్రిటన్, అమెరికాలు వరుసగా 6, 7 స్థానాల్లో నిలవడం విశేషం.దాదాపుగా వీసా లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్‌కి ఏ దేశాలు అవకాశమిస్తున్నాయి అనే ప్రాతిపదికన అత్యుత్తమ సేవలు అందిస్తున్న పాస్‌పోర్టుల జాబితాను ప్రతి ఏటా హేన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకటిస్తుంటుంది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు