భోజ్ పురి పవర్ స్టార్ పవన్ పై రాళ్లదాడి.. ముందుకొచ్చి విసురు అంటూ?

భోజ్ పురి హీరో సింగర్ పవర్ స్టార్ పవన్ సింగ్ కు తాజాగా చేదు అనుభవం ఎదురయింది.

లైవ్ లో అతనిపై కొంతమంది రాళ్లు విసిరిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రస్తుతం ఇదే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి.

కాగా భోజ్ పురి ఇండస్ట్రీ పవర్ స్టార్ గా అక్కడివారు పవన్ సింగ్ ని పిలుస్తూ ఉంటారు.ఇకపోతే తాజాగా పవన్ సింగ్ ఉత్తరప్రదేశ్ బల్లియా జిల్లా నాగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు పవన్ సింగ్.

ఈ నేపథ్యంలోనే అక్కడ తన లైవ్ ప్రోగ్రాం ని మొదలుపెట్టాడు.అయితే పవన్ సింగ్ అలా పాట మొదలు పెట్టాడో లేదో ఇంతలోనే ప్రేక్షకులలో నుంచి ఒక రాయి వేగంగా వచ్చి అతని ముఖానికి తాకింది.తర్వాత వరుసగా అతనిపై రాళ్ల దాడి జరగడంతో వెంటనే గమనించిన ఈవెంట్ మేనేజర్లు అక్కడి నుంచి పవన్ సింగ్ ని కిందకు దింపేశారు.

ప్రేక్షకులు రాళ్లతో విసరడానికి గల కారణం అడిగిన పాట పాడలేదన్న కోపంతో కొంతమంది మద్యం తాగి యువకులు ఆ విధంగా చేసినట్టు తెలుస్తోంది.ఆ ఘటనపై సీరియస్ అయినా పవన్ సింగ్ గుంపులో ఉండి రాళ్లు విసురుతున్నది ఎవరు మీకు అంత దమ్ము ఉంటే నా ముందుకు వచ్చి విసరండి.

Advertisement

నా శత్రువు దాక్కుని ఉండడం నాకు ఇష్టం లేదు అని సీరియస్ అయ్యాడు పవన్ సింగ్.ఇక పవన్ సింగ్ కు రాయి తగలడంతో అక్కడున్న వారందరూ వెళ్లిపోయారు.ఇక ప్రస్తుతం పవన్ పరిస్థితి బాగానే ఉందనీ తెలుస్తోంది.

రాయి బలంగా తగలకపోవడంతో ప్రమాదం తప్పిందని తెలుస్తోంది.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

భోజ్ పురి ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది.ఈ వీడియోని చూసిన పవన్ సింగ్ అభిమానులు రాళ్లు విసిరిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకొందరు అలా రాళ్లు విసరాం కరెక్ట్ కాదని అది ఒకవేళ బలంగా తగిలి ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?
Advertisement

తాజా వార్తలు