పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలి..: కేటీఆర్

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్( Former Minister KTR ) పిలుపునిచ్చారు.బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమావేశాన్ని నిర్వహించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో( Assembly elections ) చాలా నియోజకవర్గాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయామని కేటీఆర్ తెలిపారు.14 నియోజకవర్గాల్లో 4 నుంచి 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయామన్నారు.అయితే గ్రేటర్ హైదరాబాద్ లో అఖండ మెజార్టీతో విజయం సాధించామని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.మోసం చేయడమే కాంగ్రెస్ నైజమన్న కేటీఆర్ 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు