ప్రభుత్వ జీవోల అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.ప్రభుత్వ జీవోలను ఆన్ లైన్ లో అప్లోడ్ చేయడం లేదని కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.
విచారణలో భాగంగా పిటిషనర్ల తరపు లాయర్ల వాదనలను ప్రభుత్వ తరపు న్యాయవాది తోసిపుచ్చారు.పిటిషనర్లు చెప్పిన దానిలో వాస్తవం లేదని కోర్టుకు తెలిపారు.
గతంలో సంతకాలు లేకుండా ఆన్ లైన్ అప్ లోడ్ చేసేవారని పేర్కొన్నారు.కానీ ఇప్పుడు సంతకాలతో అప్ లోడ్ చేస్తున్నామని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు.
రాజ్యాంగపరమైన సమస్యలు ఉన్నందున ఈ అంశానికి సంబంధించిన ఇతర తీర్పు ప్రతులను బెంచ్ ముందుంచాలని పిటిషనర్ల లాయర్లకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.