ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 14వ తారీఖున పోలవరం పర్యటన చేపట్టడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే.ఇటీవల పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో.
మొత్తం ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి సీఎం జగన్ రెడీ అయినట్లు, పోలవరం ప్రాజెక్టు పనులు మొత్తం పరిశీలించి అధికారులతో అక్కడే సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఇటీవల ప్రభుత్వ అధికారులు తెలిపారు.అదే సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ జగన్ పర్యటన లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉంటే తాజాగా సీఎం జగన్ పోలవరం పర్యటన రద్దు చేసుకున్నట్లు .పర్యటన వాయిదా వేసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అందుతున్న సమాచారం.సో ఈ నెల 14వ తారీకున అనగా రేపు ముఖ్యమంత్రి జగన్ పోలవరం పర్యటన కి వెళ్ళటం లేదని ప్రభుత్వ ఉన్నత అధికారులు చర్చించుకుంటున్నారు.ప్రస్తుతం కుండపోత వర్షాలు రాష్ట్రంలో కురుస్తూ ఉండటంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.