పెళ్ళయ్యి, బాబు పుట్టాడు .. అయితేనేం, ఇంకా ఎక్కువ చూపిస్తా అంటోంది

ఎప్పుడో, 2000వ సంవత్సరంలో కెరీర్ మొదలుపెట్టింది కరీనా కపూర్.కెరీర్ తొలినాళ్ళలో పెద్దగా హిట్స్ లేవు.

అయినా అవకాశాలు తగ్గలేదు.అన్ని, వరుసగా పెద్ద సినిమాలే చేసింది.

కెరీర్ పీక్ స్టేజిలో ఉండగానే తనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న నటుడు షాహిద్ కపూర్ తో ప్రేమలో పడి, ఆ విషయాన్ని పబ్లిక్ గానే చెప్పింది.ఆయినా పెద్ద హీరోలు ఆమె వెంటపడటం మానలేదు.

రికార్డు స్థాయి పారితోషికం తీసుకున్నా డిమాండ్ తగ్గలేదు.మధ్యమధ్యలో ఐటం సాంగ్స్ తెగ చేసినా స్టార్ హీరోయిన్ ముద్ర పోలేదు.

Advertisement

ఆమె సన్నబడితే అదో ట్రెండ్, దాని పేరు సైజ్ జీరో.మళ్ళీ ఆమె బరువేక్కినా అదో ట్రెండ్, ముద్దుగా బబ్లీ బెబో అని పేరు పెట్టారు.

స్టార్ డమ్ ఉండగానే పెళ్లి చేసుకుంది.అయినా అవకాశాలు తగ్గలేదు.

చేసేవన్నీ పెద్ద సినిమాలే.సింపుల్ గా చెప్పాలంటే, కరీనా ఏం చేసినా చెల్లుద్ది.

ఎందుకంటే ఆమె క్వీన్ ఆఫ్ బాలివుడ్ కాబట్టి.వయసు 36 ఏళ్ళు, పెళ్లి ఎప్పుడో అయిపొయింది, ఈమధ్యే ఓ బాబు కూడా పుట్టాడు.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

కరీనా ఓ వారం రోజుల ముందు కనిపించిన ఫంక్షన్ ఫోటోలు చూడండి, లేదంటే ఈమధ్య చేసిన ఫోటో షూట్ చూడండి.ఏ మూలైనా, గ్లామర్ తగ్గిందా? ఇప్పుడు అవకాశాలు తగ్గుతాయా? కరీనా గర్భంతో ఉందని, ఓ ఏడాది వీరే ది వెడ్డింగ్ సినిమా షూటింగ్ వాయిదా వేసుకున్నారు.అదీ బెబో రేంజ్.

Advertisement

ఓ ఏడాది బ్రేక్ ఇచ్చిన కరీనా, మళ్ళీ పూర్తి స్వింగ్ లో సినిమాలు చేస్తుందట.కేవలం నటనాపటిమ కనబర్చగలిగే పాత్రలే కాదు, గ్లామర్ పాత్రలు కూడా చేసేందుకు సై అంటోంది.

ఈమధ్య చేసిన ఓ రెండు మూడు హాట్ ఫోటో షూట్లు చూసే ఉంటారుగా.ఇంకొన్నేళ్ళు గ్లామర్ డోస్ తగ్గించ్చే ప్రసక్తే లేదంట.

తాజా వార్తలు