అమ్మాయి కనపడితే ముద్దయినా పెట్టాలి ?కడుపైనా చేయాలన్న బాలయ్య జైల్లో పెట్టారా: పోసాని

ఏపీ ప్రభుత్వ పెద్దల గురించి సోషల్ మీడియాలో గతంలో అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు చేసిన వారి పట్ల ఉక్కు పాదం మోపుతోంది.

ఇప్పటికే ఎంతోమంది వైకాపా కార్యకర్తలు పలువురు నాయకులు కూడా అరెస్టు అయిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే పోసాని కృష్ణమురళి ( Posani Krishna Murali ) కూడా పవన్ కళ్యాణ్ ని ( Pawan Kalyan ) కించపరిచే విధంగా మాట్లాడారని ఆయన పై చర్యలు తీసుకోవాలి అంటూ జనసైనికులు ఫిర్యాదులు చేసిన విషయం మనకు తెలిసిందే.ఇలా తన అరెస్టు గురించి వార్తలు వస్తున్న తరుణంలో పోసాని కృష్ణమురళి స్పందించారు.

ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ నాకు డబ్బు ఆశ ఉంటే నేను రాజకీయాలలోకి ఎందుకు వస్తాను కేవలం జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడం కోసమే రాజకీయాలలోకి వచ్చాను నేను రాజకీయాలలోకి వస్తే నాకు సినిమా అవకాశాలు ఉండవని నాకు తెలియదా? నేను ఏ రోజు కూడా మెగా ఫ్యామిలీని కానీ పవన్ కళ్యాణ్ ని కానీ తిట్టలేదు.ఓ ప్రముఖ టీవీ ఛానల్ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తుందంటూ ఈయన మండిపడ్డారు.

నేను పార్టీ మారానని కామెంట్ చేస్తుంటే.  ఒప్పుకోను.

Advertisement

చిరంజీవి ( Chiranjeevi ) కోరిక మేరకు ఎమ్మెల్యేగా పోటీ చేశాను.పవన్ కల్యాణ్ నా వద్దకు వచ్చి మీరు పోటీ చేయాలని చెబితే.

వారిపై గౌరవంతోనే ఎమ్మెల్యేగా పోటీ చేశానని తెలిపారు.

మహిళలను కించపరిచే వ్యక్తికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇస్తారా అంటూ మండిపడ్డారు.నాకు నంది అవార్డు వస్తే ఇది నంది అవార్డు కాదు కమ్మ అవార్డు అంటూ వెనక్కితిరిగి ఇచ్చాను కుక్కా అంటూ టీటీడీ చైర్మన్‌ను దూషించారు.అయితే నా గురించి పవన్ కల్యాణ్‌కు తెలుసు.

నేను ఎలా ఉంటానో వారికి తెలుసు.లోకేష్ పవన్ చంద్రబాబుకు నేను ఒకటే చెబుతున్నా ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చండి ప్రజలకు మంచి చేయండి.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
హీరోలు ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తారు.. కిచ్చా సుదీప్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

ఇక నన్ను అరెస్టు చేయాలంటూ కూడా కొందరు ఫిర్యాదులు చేస్తున్నారు నేనేం తప్పు చేశాను.గతంలో బాలకృష్ణ( Balakrishna ) అమ్మాయి కనపడితే ముద్దయినా పెట్టాలి కడుపైన చేయాలని నీచమైన కామెంట్లు చేశారు.ఆ వీడియోలని ఆ న్యూస్ ఛానల్ ఎప్పుడైనా ప్రసారం చేసిందా? అలాగే ఇద్దరిపై కాల్పులు జరిపితే వారు చావు అంచుల వరకు వెళ్లి వచ్చారు.అప్పుడైనా అరెస్టు చేశారా.

Advertisement

బాలకృష్ణను అరెస్ట్ చేస్తేనే నన్ను కూడా అరెస్టు చేయండనీ పోసాని చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.

తాజా వార్తలు