కళ్ళు మంట పెడుతున్నాయా.. ఈ చిట్కాలతో ఇంట్లోనే రిలీఫ్ పొందండి!

సాధారణంగా ఒక్కోసారి కళ్ళు బాగా మంట పెడుతుంటాయి.పర్యావరణ కాలుష్య కారకాలకు గురికావడం, దుమ్ము పడటం, స్విమ్మింగ్ పూల్ లోని క్లోరిన్, ఇంటిని శుభ్రపరిచే ద్రావకాలు, బ్లీచ్, సబ్బు లేదా షాంపూ వంటివి కళ్ళల్లోకి వెళ్లడం, విటమిన్ ఎ లోపం, అలర్జీలు, కళ్ళు పొడిబారడం, స్మార్ట్ ఫోన్ లాప్ టాప్ వంటి పరికరాలను అధికంగా వినియోగించడం తదితర కారణాల వల్ల కళ్ళు మంటపుడుతుంటాయి(burning eyes).

 These Home Remedies Give Relief From Burning Eyes! Burning Eyes, Home Remedies,-TeluguStop.com

అయితే బర్నింగ్ సెన్సేషన్ వల్ల తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.ఏ పని చేయలేకపోతుంటారు.

అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను పాటిస్తే ఇంట్లోనే కళ్ళు మంట నుంచి రిలీఫ్ పొందుతారు.

Telugu Eyes Tips, Eye Care, Tips, Healthy Eyes, Latest-Telugu Health

కొబ్బరి నూనెలో(coconut oil) దూది ఉండను ముంచి మూసి ఉన్న కనురెప్పలపై పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు పెట్టుకోవాలి.ఇలా చేస్తే కళ్ళు తేమగా మారుతాయి.మంట నుంచి ఉపశమనం పొందుతారు.

కళ్ళు మంటలు పుడుతున్నప్పుడు కీర దోసకాయ(Cucumber) స్లైసెస్ బాగా సహాయపడతాయి.అరగంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టిన కీరా దోసకాయ స్లైసెస్ ను కనురెప్పలపై ఉంచుకోవాలి.

ఇలా చేస్తే మంట తగ్గుతుంది.కళ్ళు చల్లగా మారుతాయి.

కలబంద జెల్ కూడా కళ్ళు మంటను తగ్గించగలదు.కలబంద ఆకు నుంచి జెల్ ను తీసుకుని కనురెప్పలపై పూసుకోవాలి.

ప‌దిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే కళ్ళు పొడి బారడం తగ్గుతుంది.

బ‌ర్నింగ్ సెన్సేషన్ నుంచి రిలీఫ్ పొందుతారు.

Telugu Eyes Tips, Eye Care, Tips, Healthy Eyes, Latest-Telugu Health

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కంటి ఆరోగ్యానికి మ‌ద్ద‌తు ఇస్తారు.బ‌ర్నింగ్ ఐస్‌, డ్రై ఐస్(Burning ice, dry ice) వంటి స‌మ‌స్య‌ల‌కు చెక్ పెడ‌తాయి.అందువ‌ల్ల ఒమేగా -3 మెండుగా ఉండే సాల్మన్, వాల్‌నట్‌లు, అవిసె గింజలు వంటి ఆహారాల‌ను డైట్ లో చేర్చుకోండి.

అంతేకాకుండా కళ్ళు మంట పెడుతున్నప్పుడు ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోండి.స్క్రీన్ టైమ్‌ తగ్గించండి.కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోండి.కాలుష్య కారకాలకు దూరంగా ఉండండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube