Allu Arjun Posani: అల్లు అర్జున్ ని ప్రశంసలతో ముంచెత్తిన పోసాని.. అతనిలో ఉన్న గొప్ప లక్షణం అదే అంటూ?

తాజాగా 69 వ జాతీయ అవార్డ్స్ కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే.

ఈ అవార్డ్స్ కార్యక్రమంలో ఈసారి మొత్తం అంతా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ( Tollywood ) హవా నే ఎక్కువగా కనిపించింది.

ముఖ్యంగా తెలుగు సినిమాలకు వరుసగా ఈ నేషనల్ అవార్డులు( National Awards ) లభించాయి.పుష్ప, ఉప్పెన, ఆర్ఆర్ఆర్ సినిమాలకు నేషనల్ అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే.

ముఖ్యంగా 69 ఏళ్ల భారతీయ సినీ చరిత్రలో ఎవరు సాధించని ఘనతను సాధించారు అల్లు అర్జున్.( Allu Arjun ) మొట్టమొదటి ఉత్తమ నటుడు జాతీయ అవార్డు అందుకున్న హీరోగా అల్లు అర్జున్ నిలిచారు.

దీంతో అభిమానులు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు అల్లు అర్జున్ ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో, రెండు తెలుగు రాష్ట్రాలలి ఎక్కడ చూసినా కూడా అల్లు అర్జున్ పేరు మారుమోగిపోతోంది.ఈ క్రమంలోనే టాలీవుడ్ నటుడు పోసాని( Posani Krishna Murali ) కూడా అల్లు అర్జున్ పై పొగడ్తల వర్షం కురిపించారు.

Advertisement

ఈ సందర్బంగా పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ.అల్లు అర్జున్‌కు ఆస్కార్ అవార్డ్( Oscar Award ) కూడా వస్తుంది.తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు రావడం చాలా సంతోషించాల్సిన విషయం.

అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం.

నేను అన్న అల్లు అర్జున్‌కు ఇష్టం.అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఉన్నా ఇప్పటికి నేర్చు కుంటూనే ఉంటాడు.అది అతనిలో ఉన్న గొప్ప లక్షణం.

జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇంతవరకు ఏ తెలుగు హీరోకి రాలేదు.అల్లు అర్జున్ ఇలాగే నేర్చుకుంటూ ఉంటే భవిష్యత్తులో ఆస్కార్ ఉత్తమ నటుడిగా అవార్డ్ కూడా వచ్చే అవకాశం ఉంది.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

రాబోయే కాలంలో బన్నీ మరిన్ని అవార్డులు గెలవాలని కోరుకుంటూ ఆల్‌ ది బెస్ట్‌ అని చెప్పుకొచ్చారు పోసాని కృష్ణ మురళి.ఈ సందర్భంగా పోసాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు