పూజా కోసం తంటాలు పడ్డ అంకుల్

అందాల భామ పూజా హెగ్డే రీసెంట్‌గా ‘అలా వైకుంఠపురములో’ సినిమాతో సూపర్ సక్సెస్‌ను అందుకుంది.దీంతో ఈ అమ్మడికి ఫుల్ డిమాండ్ వచ్చి పడింది.

ఇటు తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ అమ్మడు వరుస అవకాశాలు దక్కించుకుంటోంది.దీంతో ఈ బ్యూటితో ఒక్క సెల్ఫీ అయినా దిగాలని చాలా మంది అభిమానులు ఆరాట పడుతున్నారు.

ఈ క్రమంలో పూజాతో సెల్ఫీ దిగడానికి ఓ అంకుల్ చేసిన ప్రయత్నాలు అంతా ఇంతా కాదు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ముంబై ఎయిర్‌పోర్టు నుండి బయటకు వస్తున్న పూజా హెగ్డేతో సెల్ఫీలు దిగడానికి ఫ్యాన్స్ అందరూ పోటీ పడ్డారు.ఈ క్రమంలో ఒక అంకుల్ మాత్రం ఆమెతో సెల్ఫీ దిగడానికి చాలా కష్టపడ్డాడు.

Advertisement

ఇతను చేసిన హడావిడి నెటిజన్‌లను బాగా ఆకట్టుకుంది.ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న పూజా హెగ్డేను ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు తీస్తున్నారు.

ఇంతలో ఆమెతో సెల్ఫీ దిగడానికి ఒక అంకుల్ వచ్చాడు.అతను సెల్ఫీ తీస్తున్నాడని ఆమె కొద్ది క్షణాలు ఆగింది.

కానీ, ఆ అంకుల్ ఫోన్ పనిచేయలేదో, లేక అతనికి ఫోటో తీయడం రాలేదో తెలీదు కానీ ఫోటో మాత్రం రాలేదట.దీంతో అక్కడున్న వారందరూ నవ్వుకున్నారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళన .. ఆమెనూ తప్పిస్తున్నారా ? 
Advertisement

తాజా వార్తలు