మణిరత్నం దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చోళుల కథాంశంతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం పొన్నియన్ సెల్వన్.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇకపోతే ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమాలో కరికాలన్‌గా విక్రమ్.
అరుణ్ మోళి వర్మన్‌గా జయం రవి.వల్లవరాయన్ వాందివదేవన్‌గా కార్తి నటించారు.
ఇకపోతే ఈ సినిమాలో హీరోలుగా మొదట మణిరత్నం అనుకున్నది ఈ హీరోలని కాదట.ఈ సినిమాలో నటించడం కోసం కరికలాన్ పాత్రలో నటించిన విక్రమ్ స్థానంలో విజయ్ దళపతినీ ఎంచుకున్నారట అదేవిధంగా కార్తీ పాత్రలో నటించడానికి సూపర్ స్టార్ మహేష్ బాబుని తీసుకోవాలని మణిరత్నం భావించారని తెలుస్తుంది.
అయితే మహేష్ బాబు, విజయ్ ఇద్దరు తమ సినిమాలతో బిజీగా ఉండటంవల్ల వీరు స్థానంలో విక్రమ్ కార్తీలను ఎంపిక చేసుకున్నారట.