చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లెలో హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు..!!

చంద్రబాబు( Chandrababu ) స్వగ్రామం నారావారి పల్లెలో( Naravari Palli ) పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.

అల్లర్ల దృష్ట్యా అదనపు బలగాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

ఈసారి ఎన్నికలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా బీజేపీ.

జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకోవడం జరిగింది.ఎన్నికలలో కూటమి తరుపున పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కూడా చాలా హోం వర్క్ చేసి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది.

Advertisement

మండుటెండల్లో ఎన్నికల ప్రచారం సమయంలో రోజుకి రెండు నుండి మూడు బహిరంగ సభలలో పాల్గొన్నారు.ఎన్నికల ప్రచారం చివరికి వచ్చేసరికి వైసీపీ ప్రభుత్వం పై( YCP Govt ) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్( Land Titling Act ) పేరిట వైసీపీ ప్రభుత్వంపై ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేసిన కామెంట్స్.

ఏపీ రాజకీయాలను కుదిపేసాయి.కాగా ఈసారి పోలింగ్ 80 శాతానికి పైగా దాటడంతో.

గతానికంటే ఎక్కువ పోలింగ్ నమోదు కావటంతో ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానే.ఓటర్లు పోలింగ్ లో అత్యధిక సంఖ్యలో  పాల్గొన్నారు అని తెలుగుదేశం నేతలు అంటున్నారు.

అంతేకాకుండా అధికారంలోకి తామే వస్తామని చెబుతున్నారు.ఎగ్జిట్ పోల్స్ లో కూడా టీడీపీ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయని ఫలితాలు రావడం జరిగాయి.

బాలయ్య టాక్ షోకు పోటీగా రానా టాక్ షో.. ఆ ప్రముఖ షోకు హాజరయ్యే గెస్టులు వీళ్లే!
వయనాడ్ ఎన్నికల బరిలోకి నవ్య హరిదాస్.. అసలు ఎవరు ఈమె..?

మరి రేపు ఫలితాలలో టీడీపీ అధికారంలోకి వస్తాదో రాదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు