ఏపీలో అసెంబ్లీ మరియు లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కూటమి (టీడీపీ – బీజేపీ – జనసేన) ప్రచారాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే రాష్ట్రంలో నిర్వహించనున్న నాలుగు బహిరంగ సభలకు ప్రధాని మోదీ( PM Modi ) హాజరుకానున్నారు.
అనకాపల్లి,( Anakapalli ) రాజమండ్రి( Rajahmundry ) బహిరంగ సభల్లో మోదీ పాల్గొననున్నారు.అదేవిధంగా కడప లేదా రాజంపేట మరియు మరో చోట ఏర్పాటు చేయనున్న సభల్లో మోదీ పాల్గొననున్నారని పార్టీ నేతలు చెబుతున్నారని తెలుస్తోంది.
మోదీతో పాటు సభలకు చంద్రబాబు,( Chandra Babu ) పవన్ కల్యాణ్( Pawan Kalyan ) కూడా హాజరుకానున్నారు.కాగా రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కూటమి నేతలు తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.