శిల్పాశెట్టి దంపతులకు భారీ షాక్ తగిలిందా.. అన్ని కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్ చేశారా?

మనీలాండరింగ్‌ కేసు( Money Laundering Case )లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది.అయితే ఇందులో భాగంగానే ప్రముఖ నటి శిల్పాశెట్టి దంపతులపై( Shilpa Shetty Couple ) ఈడీ చర్యలు చేపట్టింది.ఆమె భర్త రాజ్‌కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల స్థిర, చర ఆస్తులను అటాచ్‌ చేసింది.ఇందులో జుహూలోని ఒక నివాస ఫ్లాట్‌ శిల్పా శెట్టి పేరు మీద ఉన్నట్లు తెలిపింది.

 Ed Attaches Raj Kundra Properties Worth Rs 97 Crore In Bitcoin Investment Fraud-TeluguStop.com

దీంతో పాటు పుణెలోని ఒక నివాస బంగ్లా, రాజ్‌కుంద్రా( Raj Kundra ) పేరు మీదున్న ఈక్విటీ షేర్లను కూడా అటాచ్‌ చేసినట్లు తెలిపింది.

అలాగే ముంబైకి చెందిన వేరియబుల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ 2017లో గెయిన్‌ బిట్‌కాయిన్‌ పోంజీ స్కీమ్‌( Gain Bitcoin Scheme ) ను నిర్వహించింది.ఇందులో భాగంగా బిట్‌ కాయిన్లలో పెట్టుబడులు పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని ఆశ చూపి మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ పద్ధతిలో ఏజెంట్ల ద్వారా ముంబై, దిల్లీ నగరాల్లో అమాయకుల నుంచి రూ.6,600 కోట్లు వసూలు చేశారు.ఈ మోసం బయటపడటంతో సంస్థ, దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.ఈ స్కామ్‌ మాస్టర్‌మైండ్‌ అయిన అమిత్ భరద్వాజ్‌( Amit Bharadwaj ) నుంచి రాజ్‌ కుంద్రా 285 బిట్‌కాయిన్లను తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది.

వీటితో ఉక్రెయిన్‌లో బిట్‌కాయిన్‌ మైనింగ్‌ ఫామ్‌ను( Bitcoin Mining Form ) ఏర్పాటు చేయాలని రాజ్‌కుంద్రా ప్రణాళికలు వేసినట్లు తెలిపింది.ఈ కాయిన్లు ఇప్పటికీ అతడి వద్ద ఉన్నాయని, ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం వాటి విలువ రూ.150 కోట్లకు పైనే ఉంటుందని వెల్లడించింది.ఈ క్రమంలోనే కేసు దర్యాప్తులో భాగంగా రాజ్‌కుంద్రా ఆస్తులను అటాచ్‌ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube