రాజన్న అలయం వద్ద యాచక వృత్తి చేసుకునే నిరుపేద వృద్ధులకు దాతల సహకారంతో మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో చలికాలంలో ఒక్కొక్కరికి రెండు చద్దర్లు పంపిణీ చేయడం జరిగింది.ఆచద్దర్లు ఎవరో ఎత్తుకొని పోవడంతో ప్రతీరోజు అన్నదాన సమయంలో సారు మా చద్దర్లు ఎవరో దొంగలు ఎత్తుకుని వెళ్లారు.
దయుంచి చద్దర్లు ఇవ్వండి అని కోరడంతో గురువారం రోజున రాజన్న ఆలయ పార్కింగ్ స్థలంలో పేద వృద్ధులకు చద్దర్లు పంపిణీ చేయడం జరిగిందని ట్రస్టు నిర్వాహకులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్, ప్రతాప నటరాజు, మహమ్మద్ అబ్దుల్ రఫీక్, పొలాస రాజేందర్, సగ్గు రాహుల్, నక్క వేణు, పసూల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
.