రాజన్న సిరిసిల్ల జిల్లా : బుధవారం రాత్రి సుమారు 10 :30 నిమిషాలకు గంభీరావుపేట గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు గంభీరావుపేట ఎస్సై బి రామ్మోహన్ తన సిబ్బందితో కలిసి తనిఖీ చేయగా
ఎండి అమీర్, జంగరాజు, ఎండి నవీద్ అలీ,పెంటమ్ శంకర్, ఎస్కే సాదుల్, రోడ్డ నాగరాజు ఆరుగురు వ్యక్తులు పేకాట ఆడుతుండగావారిని పట్టుకొని వారి నుండి 52 పేక ముక్కలు, 4360/- రూపాయలు, 5 మొబైల్ ఫోన్స్ , మూడు బైకులు సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపిన ఎస్ఐ రామ్మోహన్.