తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్న ఒకే ఒక హీరో అల్లు అర్జున్.( Allu Arjun ) ఈయన పుష్ప సినిమాతో పాన్ ఇండియా లో సూపర్ సక్సెస్ ను సాధించి తన సత్తా ఏంటో చూపించుకున్నాడు.
ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ప్రస్తుతం వన్ అఫ్ ది టాప్ హీరోగా గుర్తింపు పొందుతున్నాడు.ఇక ఇప్పుడు పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో మరోసారి తన ప్రభంజనాన్ని సృష్టించడానికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఆ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు.ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని చూసిన ప్రతి ఒక్క అభిమాని కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు.ఇక ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో( Bollywood ) అయితే ఈ సినిమాకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి.ఇక పుష్ప మేనియా ను చూసిన బాలీవుడ్ హీరోలు బెంబేలేత్తుతున్నారు అలాగే టాలీవుడ్ లో కూడా చాలామంది హీరోలు అల్లు అర్జున్ ను మ్యాచ్ చేయలేకపోతున్నారనే చెప్పాలి.
మరిలాంటి క్రమంలో ఈయన చేస్తున్న ఈ సినిమాలు ఎంతవరకు సక్సెస్ సాధిస్తాయి అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఈ సినిమా తర్వాత ఆయన సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) డైరెక్షన్ లో కూడా సినిమా చేయబోతున్నాడు.ఇక ఇప్పటికే త్రివిక్రమ్ తో( Trivikram ) కూడా ఒక సినిమా కమిట్ అయ్యాడు.మరి ఆ సినిమా పట్టాలెక్కుతుందా లేదా అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఎందుకంటే త్రివిక్రమ్ కి ఇప్పుడు గుంటూరు కారం సినిమాతో ప్లాప్ వచ్చింది.కాబట్టి పుష్ప 2 సినిమాతో కనక సూపర్ సక్సెస్ అయితే ఇక అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేసే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి…
.