భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ కారు గురించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆయన వాడుతున్న మెర్సిడెస్ మేబ్యాక్ S 650 కారులో ప్రయాణం చేయనున్నారు.
ప్రస్తుతం ఉన్న ఆయన కారు అప్ గ్రేడ్ అయ్యింది.రేంజ్ రోవర్ నుండి మెర్సిడెస్ బెంజ్ కు రేంజ్ మార్చారు మోడీ.
ఈ కారు మార్చడానికి ప్రధాన కారణం సెక్యూరిటీ రీజన్ అని చెబుతున్నారు.
సెక్యూరిటీ రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నారట.
ఈ కారు కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయట.ఈ కారు బుల్లెట్లు, పేలుళ్లు సంభవించిన సురక్షితంగా ఉండేలా డిజైన్ చేశారట.
ఈ కారు రేంజ్ రోవర్ వోగ్- టయోటా ల్యాండ్ క్రూయిజర్ నుండి అప్ గ్రేడ్ చేయడం జరిగింది.ఇటీవలే మోడీ ఈ కారులో కనిపించారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢీల్లీ కి వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలకడానికి హైదరాబాద్ హౌస్ కు వచ్చిన మోడీ మొదటిసారి ఈ కారులో కనిపించారు.
ఇంకా ఈ కారు ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.అత్యున్నత భద్రత ప్రమాణాలతో కూడిన ఈ కారు విలువ రూ.12 కోట్ల రూపాయలకు మించే ఉంటుందని సమాచారం.
ఈ కారు కి రెండు మీటర్ల సమీపంలో 15 కేజీల టీఎన్టీ బ్లాస్ట్ జరిగిన కూడా ఈ కారు ప్రొటెక్ట్ చేయగలిగే సామర్ధ్యం కలిగి ఉంటుందట.అంతేకాదు దీని బాడీ ఎక్స్ ఫ్లోజన్ నుండి కూడా ప్రొటెక్ట్ చేస్తుందట.
ఒక వేళ గ్యాస్ అటాక్ జరిగితే కారులో సపరేట్ ఎయిర్ సప్లై కూడా అరెంజ్ చేశారట.ఈ కారులో విశేషం ఏంటంటే అత్యుత్తమ రక్షణ ఇందులోని సెక్యూరిటీ సిస్టం అడ్వాన్స్ టెక్నాలిజీ తో ఉండడం.దేశాధినేతల భద్రతను పరిగణలోకి తీసుకుని మోడీ వాహనాన్ని అప్ గ్రేడ్ చేశారు.ఈ కారు గరిష్టంగా 160 KMPH వేగంతో పరిగెత్తగలుగుతుందట.ఈ కారు పేలుళ్లను, బుల్లెట్లను తట్టుకోగలుగుతుంది కాబట్టి ఏం జరిగిన ఇందులో వారు సురక్షితంగా ఉంటారట.విన్నారుగా మోడీ కారులో ఉండే అద్భుతమైన ఫీచర్స్.