ఫోన్ ట్యాపింగ్ కేసు : కేటీఆర్ తో పాటు ఆయనా ఇరుకున్నట్టేనా ?

తెలంగాణ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో( BRS ), ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చోటు చేసుకోవడం, అప్పట్లోనే దీనిపై విపక్షాలు అనేక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

తెలంగాణలో రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తరువాత ఈ ట్యాపింగ్ వ్యవహారంపై పూర్తిగా దృష్టిపెట్టారు.ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారి ప్రణీతరావు తో పాటు మరికొంతమంది పోలీసులు అరెస్టయ్యారు.

ముఖ్యంగా ఈ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన మాజీ పోలీసు అధికారి ప్రభాకర్ రావు అప్రూవల్ గా మారబోతున్నట్లు సమాచారం .ప్రభాకర్ రావు( Prabhakar Rao ) లేదా మరో సీనియర్ పోలీస్ ఆఫీసర్ అప్రూవల్ గా మారి సంచలన విషయాలు బయట పెట్టబోతున్నట్లు సమాచారం.ముఖ్యంగా ఈ కేసు వ్యవహారంలో ప్రభాకర్ రావు తీవ్ర ఆందోళనలో ఉన్నారట.

ఇప్పటికే పోలీస్ శాఖలోని తన సన్నిహితులతో టచ్ లో ఉన్నారట .

Phone Tapping Case Was He With Ktr, Brs, Brs Working President, Ktr, Errabelli D
Advertisement
Phone Tapping Case Was He With KTR, Brs, Brs Working President, Ktr, Errabelli D

ఈ కేసు విషయమై వారితో ప్రస్తావిస్తూ.తన రాజకీయ బాసులు చెబితేనే ఈ వ్యవహారానికి పాల్పడ్డానని అంగీకరించారట.అయితే ఈ వ్యవహారం అంతా బయట పెట్టేందుకు అప్రూవల్ గా మారితే బయట పడేస్తామన్న ఆఫర్ కూడా వెళ్ళిందట.

దీంతో ప్రభాకర్ రావు త్వరలోనే ఇండియాకు రాబోతున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్( Phone tapping ) వ్యవహారం చాలా కఠినమైనది.ట్యాపింగ్ చేసినట్లుగా పక్క ఆధారాలు ఉండడంతో, టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు పెడుతున్నారు.

కేవలం టాపింగ్ వ్యవహారంతో పాటు, ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారం తో అనేకమంది వ్యాపారులను దోచుకోవడాన్ని బయట పెట్టబోతున్నారట.అలాగే ఎన్నికల సమయంలో పోలీసులు వాహనాల్లో డబ్బు తరలింపు అంశాన్ని బయటపెట్టబోతున్నారట.

Phone Tapping Case Was He With Ktr, Brs, Brs Working President, Ktr, Errabelli D

ప్రస్తుతం ఈ వివరాలన్నీ పోలీసులు వద్ద ఉన్నాయి.అందుకే ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చి పోలీసులు ఎదుట లొంగి పోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ప్రభాకర్ రావు లేదా మరో నిందితుడు అప్రూవల్ గా మారితే ఈ వ్యవహారంతో సంబంధాలు ఉన్న ఇద్దరు మాజీ మంత్రులు కేసులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు మరో మాజీ మంత్రి ఎర్రబెల దయాకర్ రావు పేరు ఈ కేసులో ఎక్కువగా వినిపిస్తోంది.ప్రభాకర్ రావు అరెస్టు వ్యవహారం తర్వాత కేటీఆర్, దయాకర్ రావులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందట.

Advertisement

తాజా వార్తలు