చెరువు మట్టిలో రసాయన ఎరువులకు మించిన పోషకాలు ఉన్నాయని తెలుసా..?

ప్రస్తుతం వ్యవసాయ రంగంలో( agriculture ) రసాయన ఎరువుల వినియోగం విపరీతంగా పెరగడం వల్ల రోజురోజుకు నేల భూసారాన్ని కోల్పోతూ వస్తోంది.నేల భూసారం కోల్పోతే భవిష్యత్తులో నేల వ్యవసాయానికి పనికిరాదు.

 Did You Know That Pond Soil Contains Nutrients Beyond Chemical Fertilizers , Agr-TeluguStop.com

కాబట్టి సేంద్రీయ ఎరువులకే అధిక ప్రాధాన్యం ఇస్తే, మొదట్లో దిగుబడి కాస్త తక్కువగా ఉన్న క్రమంగా పెరుగుతుంది.చెరువు మట్టిలో రసాయన ఎరువులకు మించిన పోషక ఎరువులు ఉన్నాయని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.

భూమికి పోషక సామర్థ్యం పెంచడంతోపాటు నాణ్యమైన దిగుబడి పొందాలంటే ఒండ్రుమట్టి వాడకం అత్యంత కీలకం.ఒండ్రుమట్టి అధికంగా చెరువుల్లో ఉంటుంది.

చెరువు మట్టిలో 70% ఒండ్రుమట్టి, 30% బంక మట్టి ఉంటుంది.చెరువు మట్టిలో నత్రజని, భాస్వరం, పొటాష్, సూక్ష్మ పోషకాలు కావలసినంత ఉంటాయి.

కాబట్టి చెరువుల్లో పూడిక తీసి ఆ మట్టిని పంట పొలాలకు తోలడం ద్వారా పంట పొలాల సారం పెరుగుతుంది.

Telugu Agriculture, Alluvial Soil, Crop Yield, Immunity, Pond Soil-Latest News -

అంతేకాదు పంటకు రోగ నిరోధక శక్తి ( Immunity )కూడా పెరుగుతుంది.నేల నీటిని నిలుపుకునే శక్తి నాలుగు నుండి ఏడు శాతం వరకు పెరుగుతుంది.ఇక రసాయన ఎరువుల వినియోగాన్ని 10 నుండి 15% వరకు తగ్గించుకోవచ్చవేసవికాలంలో చెరువులో నీటిమట్టం దాదాపుగా తగ్గిపోతుంది.

కొన్నిసార్లు చెరువుల్లో చుక్క నీరు కూడా మిగలదు.అలాంటి చెరువుల్లో మట్టిని ముందుగా నేలపరీక్ష చేపించి, లవణ సాంద్రత నాలుగు కన్న తక్కువ, నేలలో ఉదజని సూచిక 8.4 కంటే తక్కువగా ఉంటేనే ఆ మట్టిని పంట పొలాలకు తోలాలి.

Telugu Agriculture, Alluvial Soil, Crop Yield, Immunity, Pond Soil-Latest News -

ఒక ఎకరాకు సుమారుగా 20 ట్రాక్టర్ల మట్టి తోలాలి.ఒకసారి చెరువు మట్టి తోలితే దాదాపుగా ఐదేళ్ల వరకు పంటలకు పుష్కలంగా పోషకాలు అందుతాయి.ఈ మట్టిని పొలాలలో తోలెందుకు మే నెల చాలా అనుకూలం.

చెరువు మట్టి తొలడం వల్ల అనవసర రసాయన ఎరువుల ( Chemical fertilizers )వినియోగం తగ్గడంతో పాటు నాణ్యమైన పంట దిగుబడి( Crop yield ) పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube