'ఫణి' తుఫాన్ కు అల్లాడిన బంగ్లాదేశ్

ఒడిశా నగరాన్ని చిగురు టాకులాగా వణికించిన ఫణి తుఫాన్ శనివారం బంగ్లాదేశ్ తీరాన్ని తాకింది.అయితే ఈ తుఫాన్ ధాటికి బంగ్లాదేశ్ కూడా అల్లాడిందింది.

ఈ తుఫాన్ ప్రభావం తో భారీ వర్షాల కారణంగా అక్కడ వాగులు,వంకలు అన్నీ కూడా ఉప్పొంగడం తో అక్కడ పరిస్థితి దయనీయంగా మారింది.దీనితో అక్కడ ఒక్క రోజులోనే 14 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా గాయపడ్డారు.

ఈ కుండపోత వర్షాల కారన్మగా దాదాపు 16 లక్షల మంది ప్రజలను బంగ్లా అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.ఈ తుఫాన్ కారణంగా నదులు పొంగడం తో దాదాపు 36 గ్రామాలు నీటమునిగినట్లు తెలుస్తుంది.

మరోపక్క ఒడిశా లో ఈ ఫణి తుఫాన్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 16 కి చేరుకున్నట్లు తెలుస్తుంది.శుక్రవారం నాటికి 8 మంది మృతి చెందగా శనివారం ఆ సంఖ్య 16 కి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

ఫణి తుఫాన్ తీరాన్ని దాటడం తో ఒడిశా అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.ఈ ప్రచండ తుఫాన్ కారణంగా కుప్పకూలిన 10,000 విద్యుత్ స్తంభాలను పునరుద్దరించినట్లు తెలుస్తుంది.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తుఫాన్ సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు.ప్రస్తుతం ఒడిశా పరిస్థితి దయనీయంగా మారింది.

ఇంకా కొన్ని ప్రాంతాల్లో విధ్యుత్ లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.మరికొన్ని ప్రాంతాల్లో అయితే బాహ్య ప్రపంచం తో సంబంధాలు కూడా లేకుండా తీవ్ర అవస్థలు పడుతున్నారు.

మరోపక్క ప్రచండ తుఫాన్ ధాటికి విలవిల్లాడిన ఒడిశా లో ప్రధాని నరేంద్ర మోడీ ఏరియల్ సర్వ్ నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితుల పై సి ఎం పట్నాయక్ కు మోడీ ఫోన్ చేసి కనుక్కున్నట్లు తెలుస్తుంది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

ఈ సందర్భంగా ఒడిశా కు తగిన సాయం కూడా అందిస్తామని మోడీ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు