తల్వార్, కత్తులతో విన్యాసాలు చేస్తూ ఆన్లైన్లో వీడియోలు పోస్ట్ చేయుచున్న వ్యక్తి అరెస్టు, రిమాండ్ కు తరలింపు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) సిరిసిల్ల పట్టణంలోని సంజీవయ్య నగర్ కు చెందిన తోటిచర్ల సాయి వర్ధన్ s/o సురేష్ గత కొద్ది నెలల క్రిందట తల్వార్,పెద్ద కత్తితో విన్యాసాలు చేస్తూ వాటిని పట్టుకొని వివిధ ఫోటోలు, వీడియోలు తీసుకొని ఇంస్టాగ్రామ్(Instagram ) లో అప్లోడ్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయగా అట్టి ఫోటోలు, వీడియోలు పోలీసు వారు దృష్టికి రావడంతో అతనిపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసి తేదీ 17-07-2024 రోజున అతడిని అరెస్టు చేసి అతని వద్ద నుండి ఒక పెద్ద కత్తి, మోటార్ సైకిల్ ను స్వాధీన పరుచుకొని రిమాండ్ కు తరలించినట్టుగా సిరిసిల్ల పట్టణ పోలీస్ ఇన్స్పెక్టర్ కే .

కృష్ణ తెలిపారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఆన్లైన్ రీల్స్, వీడియోల పేరుతో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే వారిపై నూతన చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని ప్రజలకు తెలియజేశారు.

అమ్మ మాట-అంగన్వాడి బాట కార్యక్రమం ప్రారంభం

Latest Rajanna Sircilla News