లాక్ డౌన్ పై జనాల్లో కన్ఫ్యూజన్ ? ఉందా లేదా ?

దేశమంతా కరోనా భయంతో అల్లాడుతుండడం తో మళ్లీ తప్పనిసరిగా లాక్ డౌన్ విధిస్తారనే  ప్రచారం కొద్దిరోజులుగా సాగుతోంది.

అయితే ప్రధాని నరేంద్ర మోడీ భారత్ లో లాక్ డౌన్ విధించే ఆలోచన ఏదీ లేదని చెప్పినా, సోషల్ మీడియాలో మాత్రం దీనికి సంబంధించిన ప్రచారం సాగుతోంది.

మే రెండో తేదీ నాటికి ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియనున్న నేపథ్యంలో ఆ తరువాత దేశమంతా లాక్ డౌన్ విధిస్తారని, విదించకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందని, పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడంతో, జనాల్లో ఒకటే ఆందోళన మొదలైంది.లాక్ డౌన్ అకస్మాత్తుగా విధించడం వల్ల తలెత్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో నిరుడు బాగా అనుభవం అవడంతో, జనాలు ముందుగానే మేల్కొన్నారు.

తమకు కావాల్సిన నిత్యావసరాలు, ఇతర వాటిని ముందుగానే తెచ్చుకుంటూ జాగ్రత్త పడిపోతున్నారు.ప్రధాని లాక్ డౌన్ ఉండదు అని ప్రకటన చేసినా, సోషల్ మీడియాలో మాత్రం లాక్ డౌన్ తప్పదనే వార్తలు విస్తృతం అవుతున్న నేపథ్యంలో , ఒకటే కన్ఫ్యూజన్ జనాల్లోనూ కనిపిస్తోంది.

దీనిపై ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్లారిటీ ఇచ్చినా, దీనిపై ప్రచారం మాత్రం ఆగడం లేదు.  దీనికి తగ్గట్టుగానే అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు ఆంటోనియో పౌచి భారత్ లో కరోనా అదుపులోకి రావాలంటే తప్పనిసరిగా లాక్ డౌన్ ఒక్కటే మార్గమని మీడియా ద్వారా సందేశం పంపించారు.

Advertisement

  ఇది కూడా బాగా వైరల్ అయింది.ఇది కూడా మీడియా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న నేపథ్యంలో తప్పనిసరిగా భారత్ లో లాక్ డౌన్ విధిస్తారని ప్రచారం ఊపందుకుంది.

రోజుకు దాదాపు నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  దీంతో ప్రపంచ దేశాలు ఆందోళన లో ఉన్నాయి.

ఇప్పటికే అనేక దేశాలు భారత్ కి రాకపోకలను నిషేధించాయి.కేంద్రం లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోకుండా, రాష్ట్రాలపై ఈ భారం అంతా వదిలేయాలి అని చూస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో మాత్రం మే మూడు నుంచే లాక్ డౌన్ ఉంటుంది అనే ప్రచారం ఊపందుకుంది.

దీంతో జనాలు మరింత అయోమయానికి గురవుతున్నారు.

రూ.77 వేల కీచైన్ కొని భర్తకు భార్య షాక్.. రియాక్షన్ మాత్రం మామూలుగా లేదుగా!!
Advertisement

తాజా వార్తలు