దిల్ రాజు కంట్లో పడ్డ పెళ్లిసందడి హీరోయిన్..!

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లిసందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది శ్రీలీల.ఈ సినిమాలో ఆమె నటనకు తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.

అందుకే ఆమెకు వరుస క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి.ఆల్రెడీ మాస్ మహరాజ్ రవితేజ సినిమాలో ఛాన్స్ అందుకున్న శ్రీలీల లేటెస్ట్ గా మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తుంది.

దిల్ రాజు నిర్మాతగా తన ఫ్యామిలీ హీరో ఆశిష్ రెడ్డి హీరోగా ఒక సినిమా వస్తుందట.రౌడీ బోయ్స్ తర్వాత ఆశిష్ చేస్తున్న ఆ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

అంతేకాదు ఈ సినిమాలో నటించేందుకు గాను ఆమెకు భారీ రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది.ఆశిష్ రెడ్డి, శ్రీలీల జంటగా చేస్తున్న సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా మిక్కి జే మేజర్ ను సెలెక్ట్ చేసినట్టు టాక్.

Advertisement

ఇక ఈ సినిమాకు డైరక్టర్ ఎవరన్నది మాత్రం నిర్ణయించలేదు.పెళ్లిసందడి రిజల్ట్ ఎలా ఉన్నా శ్రీలీలకు మాత్రం మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పొచ్చు.

దిల్ రాజు కంట్లో పడ్డది అంటే అమ్మడి దశ తిరిగినట్టే లెక్క. మరి శ్రీలీలకు రాబోతున్న సినిమాలు ఎలాంటి ఫలితాలను అందిస్తాయో చూడాలి.

Advertisement

తాజా వార్తలు