గ్యాస్ సిలిండర్ ధర చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.రోజు రోజుకి పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు.
గ్యాస్ ధర చూసి సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.ఈ క్రమంలోనే పేటీఎం తన వినియోగదారులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది.
పేటీఎం యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వారికి భారీ ఆఫర్‌ను ప్రకటించింది.ఈ ఆఫర్ లో భాగంగా మీరు మూడు సిలిండర్ల బుకింక్ పై 3000 రూపాయిల వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది.
అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్నీ గుర్తుపెట్టుకోవాలి.
అది ఏంటంటే.
ఈ ఆఫర్ కేవలం పేటీఎం ద్వారా మొదటిసారి గ్యాస్ బుక్ చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది.ఒకవేళ మీరు గతంలో పేటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసినట్లయితే ఈ ఆఫర్ మీకు వర్తించదు.
మొదటిసారి బుక్ చేసుకునే వారు మాత్రమే ఈ ఆఫర్ ఉపయోగించుకోగలరు.మీరు పేటిఎమ్ లో గ్యాస్ బుక్ చేస్తున్నప్పుడు మొదటి మూడు గ్యాస్ సిలిండర్ బుకింగ్ లకు ఒక్కో బుకింగ్ కు రూ.1000 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.అంటే ప్రతీ గ్యాస్ బుకింగ్ పై మీకు ఒక స్క్రాచ్ కార్డ్ లభిస్తుంది.అంటే ఆ స్క్రాచ్ కార్డు ద్వారా మీరు ఐదు రూపాయిల నుండి రూ.1000 వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం కలదు.ఈ ఆఫర్ వర్తించాలంటే మీరు కనీసం రూ.500 దాక ఖర్చు పెట్టాలి.

ఈ డబ్బులు పేటీఎం వాలెట్ లేదా UPI లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లిస్తే మాత్రమే ఈ ఆఫర్ చెల్లుబాటు అయ్యేలా ఉంటుంది.బుకింగ్ తరువాత మీకు వచ్చే క్యాష్ బ్యాక్ డబ్బులు మీ పేటీఎం వ్యాలెట్ లోకి వస్తాయి.అయితే మొదటి సిలిండర్ బుకింగ్ ను తప్పనిసరిగా డిసెంబర్ 2021లోపు చేసుకోవాలి.ఆ తర్వాత ఆఫర్ యాక్టివేట్ చేయబడుతుంది.
ఇప్పుడు మీకు మొదటి కూపన్ వస్తుంది.అలాగే తదుపరి 2 నెలల్లో తదుపరి రెండు బుకింగ్‌లను కూడా చేయవలసి ఉంటుంది.
బుకింగ్ చేసిన తర్వాత మీరు స్క్రాచ్ కార్డ్‌ను పొందుతారు.దానిని ఓపెన్ చేసి క్యాష్ బ్యాక్ క్లెయిమ్ చేయవచ్చు.