మరొకసారి నెగిటివ్ పాత్రలో ఆర్‌ఎక్స్‌ 100 బ్యూటీ..!

పాయల్ రాజ్ పుత్ RX 100 సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది.అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

మొదటి సినిమాతోనే అభినయం, అందం తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించి కుర్రకారు మనసును దోచేసుకుంది.

ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది.దీంతో ఈ అమ్మడికి ఆఫర్లు వస్తాయని అంతా భావించారు.

కానీ అలా జరగలేదు.ఈ అమ్మడికి అంతగా అవకాశాలు అయితే రాలేదు.

Advertisement

కానీ అడపాదడపా వచ్చినా అవేవి కూడా ఆమె కెరీర్ కు బూస్ట్ ఇవ్వలేక పోయాయనే చెప్పాలి.పాయల్ విక్టరీ వెంకటేష్ సరసన వెంకీ మామ సినిమాలో అవకాశం దక్కించుకుంది.

ఈ సినిమా ద్వారా అయినా అవకాశాలు వస్తాయని ఆశపడింది.కానీ అలా కూడా జరగలేదు.

తర్వాత రవితేజ సరసన డిస్కో రాజా సినిమాలో అవకాశం వచ్చింది.కానీ ఇది కూడా నిరాశే మిగిల్చింది.

ఇంకా అవకాశాలు రాక స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించడానికి రెడీ అయ్యింది.అంతేకాదు ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించింది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గా గెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

ఈ అమ్మడికి అన్నీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలే వస్తున్నాయట.ప్రస్తుతం ఈ అమ్మడికి మరొక నెగిటివ్ పాత్రలో నటించే అవకాశం వచ్చినట్టు తెలుస్తుంది.

Advertisement

మన తెలుగు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ ఆహా ఒక వెబ్ సిరీస్ రూపొందించ బోతుంది.ఆ వెబ్ సిరీస్ లో నటించే అవకాశం పాయల్ రాజ్ పుత్ కు వచ్చిందని టాక్ నడుస్తుంది.

ఆహా వారు త్రీ రోజెస్ అనే వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ దశలో ఉంది.

ఇందులో పాయల్ కూడా జాయిన్ అయినట్టు తెలుస్తుంది.దీని గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం.

తాజా వార్తలు