అక్కడ కూడా కుమ్మేస్తున్న 'మంగళవారం'.. భారీ కలెక్షన్స్‌

పాయల్ రాజ్‌ పూత్‌(Payal Rajput ) హీరోయిన్‌ గా అజయ్‌ భూపతి దర్శకత్వం లో రూపొందిన మంగళవారం సినిమా( Mangalavaaram ) కి పాజిటివ్ టాక్ వచ్చింది.

నిన్న విడుదల అయిన ఈ సినిమా ను మొదట సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో ఎక్కువగా విడుదల చేయడం జరిగింది.

కానీ రెండో రోజు నుంచి ఈ సినిమా యొక్క మల్టీ ప్లెక్స్ స్క్రీన్స్ పెంచారు.భారీ ఎత్తున స్క్రీన్స్ సంఖ్య పెంచడం వల్ల రెండో రోజు నుంచి వసూళ్లు వస్తున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా ఇలాంటి జోనర్ సినిమాలు మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడం చాలా తక్కువ.

కానీ ఈ సినిమా తో ఆ విషయంలో సినీ విశ్లేషకుల అంచనా తారుమారు అయింది.ఈ రేంజ్ లో వసూళ్లు సాధిస్తు ఉంది అంటే కచ్చింగా హాఫ్‌ సెంచరీ ఖాయం అన్నట్లుగా బాక్సాఫీస్‌ వర్గాల వారు అంటున్నారు.తక్కువ బడ్జెట్‌ తో ఈ సినిమాను నిర్మించినా కూడా చిరంజీవి, అల్లు అర్జున్( Chiranjeevi, Allu Arjun ) వంటి స్టార్స్ తో ప్రమోషన్ చేయడం ద్వారా మంచి పబ్లిసిటీ దక్కింది.

Advertisement

అందుకే ఈ సినిమా కు మంచి బజ్ క్రియేట్‌ అయ్యి పాజిటివ్ టాక్ వచ్చింది.ఆ పాజిటివ్‌ బజ్ కి తోడు సినిమా కు పాజిటివ్ టాక్ వచ్చింది.అందుకే వసూళ్లు భారీగా వస్తున్నాయి అంటున్నారు.

ప్రస్తుతం సినిమా కి ఓవర్సీస్‌ నుంచి కూడా మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి అంటూ సమాచారం అందుతోంది.మొత్తానికి అక్కడ ఇక్కడ కూడా భారీ వసూళ్లు నమోదు అవుతున్న నేపథ్యం లో ఫుల్ రన్‌ లో మంచి వసూళ్లు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు.

చిన్న సినిమా లకు ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు వస్తున్నాయి.కనుక ఈ సినిమా కూడా ఆ రేంజ్‌ లో వసూళ్లు నమోదు చేసి, ఈ ఏడాది మేటి చిత్రాల జాబితాలో చేరే అవకాశాలు ఉన్నాయి.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?
Advertisement

తాజా వార్తలు