రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలకేంద్రంలోని వాణీనికేతన్ హైస్కూల్ లో శనివారం రోజున స్వయం పరిపాలనదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు .విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలను భోదించారు.
అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.ఇట్టి కార్యక్రమంలో కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనిధిలతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.