నటి పాయల్ ఘోష్( Payal Ghosh ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె మొదట మంచు మనోజ్ హీరోగా నటించిన ప్రయాణం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఊసరవెల్లి సినిమాలో( Oosaravelli Movie ) హీరోయిన్ తమన్నా కు ఫ్రెండ్ గా నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఆపై మిస్టర్ రాస్కెల్ సినిమాలో నటించింది.అయినప్పటికీ సరైన విధంగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కి చెక్కేసింది.
అక్కడ కూడా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది.

అయితే అందుకు గల ప్రధాన కారణం అక్కడి పరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తులే అని ఆమె ఇప్పటికే పలుమార్లు చెప్పుకొచ్చింది.ఇది ఇలా ఉంటే తాజాగా పాయలు ఘోష్ బాలీవుడ్ ఇండస్ట్రీపై( Bollywood ) సంచలన వ్యాఖ్యలు చేసింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.
దేవుడి దయ వల్ల నేను సౌత్ ఇండస్ట్రీ నుంచి సినిమాల్లోకి లాంచ్ అయ్యాను.ఒకవేళ నేను బాలీవుడ్ నుంచి ఎంట్రీ ఇచ్చి ఉండుంటే నా దుస్తులు తొలగించేవారు.
అంతటితో ఆగక అలాంటి సన్నివేశాలతో ఇప్పటికే వ్యాపారం చేసుకునేవారు.వాళ్లకు టాలెంట్‌తో పనిలేదు.
అమ్మాయిలు దుస్తులు తొలగిస్తే చాలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

కాగా గతంలో జరిగిన మీటూ ఉద్యమంలో పాల్గొన్న పాయల్ ఘోష్ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై( Anurag Kashyap ) సంచనల ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది.సినిమాలో అవకాశం కోసం కలిసినప్పుడు అతడు తనపై లైంగిక దాడి చేశాడని అప్పట్లో ఆమె వెల్లడించింది.సౌత్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని రాబోయే రోజుల్లో బాలీవుడ్‌ను ఏలుతాడని ఆమె తెలిపింది.







