వారాహి గాజువాక సభలో సీఎం జగన్ పై పవన్ సీరియస్ కామెంట్స్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) నిర్వహిస్తున్న వారాహి విజయయాత్ర ప్రస్తుతం విశాఖ జిల్లాలో కొనసాగుతుంది.

నాలుగో విడత యాత్రలో భాగంగా ఆదివారం గాజువాకలో నిర్వహించిన వారాహి యాత్ర బహిరంగ సభలో సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన పర్వాలేదు.మళ్లీ జగన్ అధికారంలోకి మాత్రం రాకూడదని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆస్తులు అమ్మేందుకు ప్రజలు మీకు అధికారం ఇచ్చారా.? జగన్( YS Jagan Mohan Reddy ) మళ్లీ వస్తే భరించలేం.గద్దెపై కూర్చుని ఆకృత్యాలు చేస్తే.

జనం చూస్తూ ఊరుకోరు.ప్రజలు మేల్కొన్నారు.

Advertisement

జగన్ గద్దె దిగక తప్పదు.జగన్ ను దేవుడు అని మొక్కాం.

దయ్యమై జనాన్ని పట్టుకున్నారు.అనీ పవన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను గెలుచుకున్న వైసీపీ ప్రజలకు( YCP ) చేసింది ఏమీ లేదని మండిపడ్డారు.అవినీతి, అక్రమాలు, భూకబ్జాలకు పాల్పడుతూ రాజ్యమేలుతున్న వైసీపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికలలో చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని గాజువాక సభలో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు