పవన్ రూటు వయా ఇండియా కూటమి వైపు ?

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఇప్పటికిప్పుడు ఇండియా కూటమి వైపు చేరతారని స్పష్టంగా చెప్పలేకపోయినా ఆయన ప్రయాణం మాత్రం ఆ దిశగా నడుస్తున్నట్లుగా కనిపిస్తుంది.

ముఖ్యంగా పేరుకి ఎన్డీఏ కూటమిలో( NDA alliance ) ఉన్నా ఆయన రాజకీయ ప్రయాణానికి కేంద్ర భాజపానేతలు ఏ విధంగానూ మద్దతు ఇస్తున్న దాఖలాలు లేవు .

ముఖ్యంగా చంద్రబాబు( Chandrababu ) అరెస్టు తదనంతర పరిణామాలతో తెలుగుదేశానికి మరింత దగ్గరైన పవన్ ఆటోమేటిక్గా ఎన్డీఏ కూటమికి దూరమైనట్లే భావించవచ్చు ,ఎందుకంటే కేంద్రం ఎన్నికల దృష్టి తో తాను తీసుకుంటున్న అనేక నిర్ణయాలకు మద్దతు కోసం జగన్ ( jagan )ప్రభుత్వంతో ఇప్పటికిప్పుడు తెగదెంపులు చేసుకోలేని భాజపా తెలుగుదేశానికి ఇప్పటికిప్పుడు డోర్ ఓపెన్ చేయలేని పరిస్థితుల్లో ఉంది.అంతేకాకుండా చంద్రబాబు అరెస్టుపై కేంద్ర పెద్దలు ఎవరూ మాట్లాడకపోవడం జగన్ కి పరోక్ష మద్దతు ఇస్తున్నట్లే జనసేన( Janasena ) ని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.

దాంతో తన దారి తన చూసుకోవడానికి పవన్ ప్లాన్ బి రెడీ చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

తెలుగుదేశం అనుభవం, జనసేన పోరాటం రెండూ ప్రస్తుతం అవసరమే అంటూ పెడన సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే బిజెపిని అఫీషియల్ గానే పక్కకు తప్పించినట్లుగా అర్థమవుతుంది.వామపక్షాలను కూడా కలుపుకొని రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేయాలన్నది జనసేన అభిమతం గా వార్తలు వస్తున్నాయి.ఈ కూటమికి కనుక వచ్చే ఎన్నికలలో సరైన ఫలితాలు వస్తే పవన్ ఇండియా కూటమికి దగ్గర అవ్వడానికి మార్గం మరింత సుగమం అవుతుందని చెప్పవచ్చు.

Advertisement

ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమి తో పూర్తిగా తెగ తెంపులు చేసుకోకపోయినప్పటికీ తెలుగుదేశంతో మరింత ముందుకు వెళ్లడం ద్వారా, మీరు వచ్చినా రాకపోయినా తన ప్రయాణం తెలుగుదేశం తోనే అని జనసేనాని కన్ఫర్మ్ చేసినట్లయ్యింది.అయితే బిజెపితో తెగతెంపులు చేసుకోవడానికి తెలుగుదేశం ఎంత మేరకు సిద్ధమవుతుందన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్ధకం గానే చూడాలి.

ఎందుకంటే ప్రస్తుతం తెలుగుదేశం ఎదుర్కొంటున్న ఒడిదుడుకులలో కేంద్ర అధికార పార్టీ మద్దతు కచ్చితంగా అవసరం.అయితే అన్ని రకాల ప్రయత్నాలు చేసినా బిజెపి కనికరించకపోతే ఇక తెలుగుదేశానికి మిగిలిన ఆప్షన్ కూడా ఇండియా కూటమే అవుతుంది.

చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడేటట్లే ఉన్నాయి .

ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !
Advertisement

తాజా వార్తలు